schedule Friday, September 11, 2026

శ్రీ నేతాజీలో గ్రీన్ డే సెలబ్రేషన్స్ అదుర్స్..!

calendar_today June 28, 2025
person dharshininews
శ్రీ నేతాజీలో గ్రీన్ డే సెలబ్రేషన్స్ అదుర్స్..!
శ్రీ నేతాజీలో గ్రీన్ డే సెలబ్రేషన్స్ అదుర్స్..! - పచ్చదనం ప్రాముఖ్యతపై పిల్లల ప్రదర్శనలు - పర్యావరణ సృహ పెంపొందించడమే లక్ష్యం - స్కూల్ డైరెక్టర్ మణిమాల, ప్రిన్సిపల్ శివలీల తాండూరు. దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలోని శ్రీ నేతాజీ గురుదేవ్ గురుకుల్ స్కూల్లో గ్రీన్ డే సెలబ్రేషన్స్ అదుర్స్ అనేలా జరుపుకున్నారు. శనివారం గ్రీన్ డే సందర్భంగా పాఠశాలలో విద్యార్థులు ఇచ్చిన పలు ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ప్రకృతి, పర్యావరణం, పచ్చదనం ప్రాముఖ్యతను తెలిపేందుకు విద్యార్థులు పచ్చని వస్తువులతో సందడి చేశారు. వివిధ రకాల ఆకుపచ్చ వస్తువులు, బొమ్మలను ప్రదర్శిస్తూ ఆట పాటలతో ఆహ్లాదాన్ని పంచారు. పచ్చదనం అంటే ఏమిటో చిన్నారులు చిన్న చిన్న మాటలతో వివరించడం మైమరిపించింది. ఈ సందర్భంగా స్కూల్ డైరెక్టర్ మణిమాల, ప్రిన్సిపల్ శివలీలలు మాట్లాడుతూ విద్యార్థులకు విద్యనందించడంతో పాటు పర్యావరణ సృహను పెంపొందించడం కోసం గ్రీన్ డే నిర్వహించడం జరిగిందన్నారు. దీనివల్ల పిల్లల్లో ప్రకృతి పట్ల ప్రేమ, చెట్ల ప్రాముఖ్యతను తెలుసుకోవడం జరుగుతుందన్నారు. అంతేకాకుండా చిన్నారుల్లో సృజనాత్మకతను పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఇదికూడా చదవండి.... https://www.dharshininews.com/36488/