schedule Monday, July 06, 2026

స్పూర్తిదాయకుడు వనజీవి రామయ్య

calendar_today July 1, 2025
person dharshininews
స్పూర్తిదాయకుడు వనజీవి రామయ్య
స్పూర్తిదాయకుడు వనజీవి రామయ్య - ఆయన ఆశయాలను నెరవేర్చాలి - మాజీ చైర్ పర్సన్ కోట్రిక విజయలక్ష్మీ వెంకటయ్య తాండూరు, దర్శిని ప్రతినిధి : ప్రకృతి ప్రేమికుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత వనజీవి రామయ్య స్పూర్తి దాయకుడు అని తాండూరు మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ కోట్రిక విజయలక్ష్మీ వెంకటయ్య అన్నారు. మంగళవారం తాండూరు పట్టణం హైదరాబాద్ రోడ్డు మార్గంలోని కోకట్ తెలంగాణ బాలికల గురుకుల పాఠశాలలో వనజీవి రామయ్య జయంతిని జరుపుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాలలో వనజీవి రామయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అదేవిధంగా పాఠశాలలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి హాజరైన మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ కోట్రిక విజయలక్ష్మీ వెంకటయ్య మాట్లాడుతూ వనజీవి రామయ్య తన జీవిత కాలంలో మూడు కోట్ల మొక్కలు నాటి ప్రపంచానికి హరిత సందేశం ఇచ్చారని అన్నారు. పర్యావరణ పరిరక్షణకు తనవంతు తోడ్పాటు అందించాలని స్ఫూర్తి నింపిన మహనీయుడు అని అన్నారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరు మొక్కలు నాటి సంరక్షించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సామాజిక కార్యకర్త వెంకట్, గాజుల బస్వరాజ్, స్కూల్ ప్రిన్సిపల్, అటవి శాఖ అధికారిణి, వి ద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/36535/