schedule Monday, July 06, 2026

ఇంటింటా విరబూసిన బ్రహ్మ కమలాలు

calendar_today July 4, 2025
person dharshininews
ఇంటింటా విరబూసిన బ్రహ్మ కమలాలు
ఇంటింటా విరబూసిన బ్రహ్మ కమలాలు - భక్తిశ్రద్ధలతో కుటుంబ సభ్యుల పూజలు - తాండూరులో ఒకే చెట్టుకు ఏడు కమలాలు తాండూరు, దర్శిని ప్రతినిధి : ఇంటింటా విరబూసిన బ్రహ్మ కమలాలు కుటుంబాలలో అదృష్ట శోభను తెచ్చి పెట్టాయి. అతి ప్రాధాన్యం, పవిత్రమైన బ్రహ్మ కమలాలు తాండూరులోని పలువురు ఇండ్లలో విరబూశాయి. ఏడాది ఒకసారి మాత్రమే విరబూసే బ్రహ్మ కమలాలకు భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. తాండూరు పట్టణంలోని వాల్మీకీ నగర్ లోని యువ వ్యాపార వేత్త పునీత్ కుమార్ నివాసంలో ఉన్న చెట్టుకు ఒకే సారి 7 బ్రహ్మ కమలాలు విరబూశాయి. ఒకే చెట్టుకు.. ఒకే రోజు 7 బ్రహ్మ కమలాలు విరబూయడంతో కుటుంబ సభ్యులంతా అదృష్టంగా భావించారు. విరబూసిన బ్రహ్మ కమలాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మరోవైపు వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలం కోటమర్పల్లి గ్రామంలో చిట్టెంపల్లి విజయలక్ష్మీ, నర్సింహులు నివాసంలో కూడా బ్రహ్మ కమలాలు విరబూశాయి. గత కొన్ని నెలలుగా వారి ఇంట్లో బ్రహ్మ కమలం చెట్టును పెంచుతున్నారు. ఏడాది తరువాత బ్రహ్మ కమలాలు విరబూయడంతో సంతోషం వ్యక్తం చేశారు. బ్రహ్మ కమలాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వారింట్లో పూసిన బ్రహ్మ కమలాలను చూసేందుకు స్థానికులు తరలివచ్చారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/36583/