schedule Monday, July 06, 2026

తెలంగాణ వేగు చుక్క దొడ్డి కొమురయ్య..!

calendar_today July 4, 2025
person dharshininews
తెలంగాణ వేగు చుక్క దొడ్డి కొమురయ్య..!
తెలంగాణ వేగు చుక్క దొడ్డి కొమురయ్య..! - ఆయన ఆశయ సాధనకు కృషి చేయాలి - మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్‌ తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణ సాయుధ పోరాటానికి దొడ్డి కొమురయ్య వేగు చుక్కగా నిలుస్తారని తాండూరు మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ అన్నారు. శుక్రవారం తాండూరు నియోజకవర్గ కురుమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన దొడ్డి కొమురయ్య వర్థంతిలో ఆమె పాల్గొన్నారు. పట్టణంలోని యశోధనగర్‌ పార్కులో ఉన్న విగ్రహానికి స్వప్న పరిమళ్‌ కురుమ సంఘం, ప్రజా సంఘాల నాయకులతో కలిసి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాటం రావడానికి, భూమి, భుక్తి, విముక్తి ఉద్యమంగా మారడానికి దొడ్డి కొమురయ్య వేగు చుక్కగా మారారని అన్నారు. తెలంగాణ తొలి అమరుడుగా దొడ్డి కొమురయ్య నిలిచారని, ఆయన ఆశయ సాధనకు అందరు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ప్రజా ప్రతినిధులు, కురుమ సంఘం నాయకులు, రాజకీయ పార్టీల నేతలు, సంఘాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/36596/