బ్రహ్మ.. కటాక్షం..!
July 5, 2025
dharshininews
బ్రహ్మ.. కటాక్షం..!
- వరుసగా విరబూస్తున్న కమలాలు
- భక్తి పారవశ్యంలో భక్తుల పూజలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : బ్రహ్మ కమలం అత్యంత పవిత్రమైన పుష్పం. ఈ చెట్టును ఇంట్లో పెంచుకుని.. సంరక్షిస్తే సకల శుభాలు జరుగుతాయని హిందూ ప్రజలు భావిస్తారు. ఈ చెట్టుకు బ్రహ్మ కమలం పూస్తే కటాక్షం సిద్దిస్తుందని నమ్మకం.
తాండూరు ప్రాంతంలో ప్రజలు పెంచుకున్న చెట్లకు బ్రహ్మ కమలాలు విరబూస్తూ దర్శనమిస్తున్నాయి. వరుసగా పలువురు ఇళ్లలో దర్శనమిస్తున్నాయి. తాండూరు మున్సిఫ్ కోర్టు న్యాయవాది నరేందర్ సింగ్ ఇంట్లో చెట్టుకు రెండు బ్రహ్మ కమలాలు విరబూశాయి.
గమనించిన కుటుంబ సభ్యులు భక్తిశ్రద్దలతో పూజలు నిర్వహించారు. బ్రహ్మ కమలాలు విరబూయడం పట్ల అదృష్టంగా భావించి సంతోషం వ్యక్తం చేశారు. ఇటీవల తాండూరులో బ్రహ్మ కమలాల విరబూస్తున్న సంఘటన ప్రజల్లో భక్తి పారవశ్యాన్ని నింపుతున్నాయి.
ఇదికూడా చదవండి...
https://www.dharshininews.com/36596/