schedule Monday, July 06, 2026

టీచర్ ఇంట్లో విరబూసిన బ్రహ్మ కమలం

calendar_today July 5, 2025
person dharshininews
టీచర్ ఇంట్లో విరబూసిన బ్రహ్మ కమలం
టీచర్ ఇంట్లో విరబూసిన బ్రహ్మ కమలం - కుటుంబ సభ్యులతో కలిసి పూజలు తాండూరు, దర్శిని ప్రతినిధి : ఆషాఢ మాసంలో పవిత్రమైన బ్రహ్మ కమలాలు పలువురు నివాసాల్లో విరివిగా విరబూస్తున్నాయి. సంవత్సరంలో ఒకసారి విరబూసే బ్రహ్మ కమలాలు ఎంతో విశిష్టమైనవి కావడంతో భక్తిశ్రద్ధలతో పూజిస్తున్నారు. తాండూరు పట్టణంలోని ప్రభుత్వ జేజేసీ పాఠశాలలో సంస్కృతం ఉపాధ్యాయులు శ్రీశైలం నివాసంలో ఆరు నెలల క్రితం వారి నివాసంలో బ్రహ్మ కమలం చెట్టును పెంచారు. శనివారం ఇంట్లోని చెట్టుకు బ్రహ్మ కమలం విరబూసింది. దీంతో కుటుంబ సభ్యులతో కలిసి బ్రహ్మ కమలంకు పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్రహ్మ కమలం చెట్టు ఎంతో విశిష్టమైందని, దీనిని పూజించడం తమ అదృష్టమని అన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/36642/