schedule Monday, July 06, 2026

సమాజ సేవకే పునరంకితం కావాలి

calendar_today July 6, 2025
person dharshininews
సమాజ సేవకే పునరంకితం కావాలి
సమాజ సేవకే పునరంకితం కావాలి - అట్టహాసంగా తాండూరు క్లబ్ ప్రమాణ స్వీకారం - పాల్గొన్న పాస్ట్ డిస్ట్రిక్ గవర్నర్, తాండూరు డీఎస్పీ తాండూరు, దర్శిని ప్రతినిధి : సమాజ సేవకు పునరంకితం కావాలని లయన్స్ క్లబ్ సభ్యులు, పలువురు పేర్కొన్నారు. ఆదివారం తాండూరు లయన్స్ క్లబ్ 51వ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం అట్టహాసంగా జరిగింది. పట్టణంలోని సల్లా గార్డెన్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా లయన్స్ క్లబ్ పాస్ట్ డిస్ట్రిక్ గవర్నర్ హరినాయణ్ భట్టాడ్, విశిష్ట అతిథిగా తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి, లయన్స్ క్లబ్ రీజియన్ చైర్మన్ మనోహర్ రెడ్డి, జోన్ చైర్మన్ రాజు భయంకర్, పాస్ట్ డిస్ట్రిక్ గవర్నర్(పీఎంసీటీ)లు హాజరయ్యారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ నూతన అధ్యక్షులుగా ఆర్. శరణు బసప్ప, కోఆర్డినేటర్ గా రొంపల్లి సంతోష్ కుమార్, ఉపాధ్యక్షులుగా మురళి మోహన్ నామాజీ, మహమ్మద్ యూసుఫ్, జి. వరప్రసాద్, కార్యదర్శి మంకాల్ నటరాజ్, జాయింట్ సెక్రటరీగా గూళీ శివకుమార్, కోశాధికారిగా గౌరీ శంకర్, మెంబర్ షిఫ్ కమిటి చైర్మన్ గా ఓం ప్రకాష్ సోమాని, క్లబ్ మార్కెటింగ్ చైర్మన్ గా పసారం బస్వరాజ్, క్లబ్ అడ్మినిస్ట్రేటర్ గా సల్లా దామోదర్, కోఆర్డీఓనేటర్ గా వై.బసప్ప, టైల్ ట్విస్టర్ గా ధనుంజయ్, లయన్ టమర్ గా రాంచంద్రారెడ్డి, డైరెక్టర్లుగా చంద్రశేఖర్, వరప్రసాద్ గనాటే, గోపాలకృష్ణ యాదవ్, సయ్యద్ జులిఫికర్ హుస్సేన్, వినోద్ జైన్, పద్మనాభయ్య, కట్కం వీరేందర్, కుంచెం మురళీధర్, రమేష్ చంద్ర పండిత్ లు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ సమాజ సేవకు లయన్స్ క్లబ్ మారు పేరుగా నిలుస్తుందని, ఆ సేవలను కొనసాగించేందుకు పునరంకితం కావాలన్నారు. ముఖ్యంగా నేత్రదానం, కంటి వైద్య శిబిరాలు, విద్యారంగంకు చేయూత అందించాలన్నారు. అదేవిధంగా నూతన కార్యవర్గ సభ్యులు మాట్లాడుతూ లయన్స్ క్లబ్ నుంచి ఆదర్శవంతమైన సేవలను నిర్వహించి.. కార్యవర్గానికి వన్నె తీసుకవస్తామని పేర్కొన్నారు. అనంతరం పదో తరగతి, ఇంటర్, డిగ్రీలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులు నగదు ప్రోత్సహాకం, పలువురుకు పురస్కారాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో లయన్స్ సభ్యులు, మహిళ కార్యవర్గ సభ్యులు, పట్టణ ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/36662/