schedule Wednesday, September 09, 2026

కార్మిక వ్యతిరేక విధానాలు రద్దుచేయాలి

calendar_today July 9, 2025
person dharshininews
కార్మిక వ్యతిరేక విధానాలు రద్దుచేయాలి
కార్మిక వ్యతిరేక విధానాలు రద్దుచేయాలి - పనిగంటల పెంపు జీఓ ఉపసంహరించుకోవాలి - ఏఐటీయూసీ ఆధ్వర్యంలో సార్వత్రిక సమ్మే తాండూరు దర్శిని ప్రతినిధి : కార్మిక వ్యతిరేక విధానాలను రద్దు చేయాలని ఏయూటీయూసీ జిల్లా నాయకురాలు విజయలక్ష్మీ పండిత్, నాయకులు డిమాండ్ చేశారు. బుధవారం తాండూరు మున్సిపల్ కార్మికులతో సార్వత్రిక సమ్మే చేపట్టారు. నాయకులు, కార్మికులు మున్సిపల్ కార్యాలయం నుంచి పురవీధుల్లో ర్యాలీగా బయల్దేరారు. పట్టణంలోని ఇందిరా చౌరస్తా వద్ద ఆందోళన వ్యక్తం చేసి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాలకు పాల్పడుతోందని మండిపడ్డారు. 8 గంటల పనిని సవరిస్తూ 10 గంటలకు పెంచడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మికులకు వేతనాలు చెల్లించకుండా వెట్టి చాకిరి చేయిస్తుందని అన్నారు. కార్మిక వ్యతిరేక ధానాలను రద్దు చేయాలని, పని గంటల పెంపు జీవోను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు, కార్మికులు పాల్గొన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/36714/