బీసీ స్మశాన వాటిక అభివృద్ధికి మరింత చొరవ చూపాలి
July 9, 2025
dharshininews
బీసీ స్మశాన వాటిక అభివృద్ధికి మరింత చొరవ చూపాలి
- ఎమ్మెల్యే చొరవతో బోరు ఏర్పాటు అభినందనీయం
- బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలోని బీసీ స్మశాన వాటిక అభివృద్ధికి మరింత అభివృద్ధికి చొరవ చూపాలని బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్ అన్నారు. బుధవారం బీసీ స్మశాన వాటికలో తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ప్రత్యేక చొరవతో నీటి బోరు ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా రాజ్ కుమార్ మాట్లాడుతూ గత కొన్నేళ్లుగా బీసీ స్మశాన వాటికలో వసతులు లేక అంత్యక్రియలకు వచ్చిన వారికి ఇబ్బందులు ఎదురవుతున్నాయని అన్నారు. సమస్యలు పరిష్కరించాలని అనేక సార్లు అధికారులు, నాయకులను కోరడం జరిగిందన్నారు. ఇందులో భాగంగా తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిని కలిసి వెంటనే స్మశాన వాటికలో మౌళిక సదుపాయాలు కల్పించాలని కోరడం జరిగిందన్నారు.
అడిగిన వెంటనే స్మశాన వాటిక అభివృద్ధికి నిధులు మంజూరు చేశారని తెలిపారు. తాజాగా ఆయన ప్రత్యేక చొరవతో స్మశాన వాటికలో బోరు వేయించి చేతి పంపును బిగించడం జరిగిందన్నారు. బోరు మోటారు ఏర్పాటు చొరవ అభినందనీయమన్నారు. బీసీ స్మశాన వాటిక అభివృద్ధికి మరింత చొరప చూపాలని కోరారు.
ఇదికూడా చదవండి...
https://www.dharshininews.com/36717/