schedule Monday, July 06, 2026

దివిటి ఎల్లప్ప సేవా దృక్పథం

calendar_today July 14, 2025
person dharshininews
దివిటి ఎల్లప్ప సేవా దృక్పథం
దివిటి ఎల్లప్ప సేవా దృక్పథం - సొంత నిధులతో రెండు బోర్లకు రిపేర్లు - నీటి సమస్య తీర్చడంపై స్థానికుల కృతజ్ఞతలు తాండూరు, దర్శిని ప్రతినిధి : ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న కాంగ్రెస్ యువనాయకుడు దివిటి ఎల్లప్ప తన సేవా దృక్ప థాన్ని చాటుకున్నారు. పట్టణంలోని పాత తాండూరు 15వ వార్డులో పోచమ్మ గుడి వద్ద ఉన్న బోరు మోటారు, కమ్యూనిటీ హాల్ వద్ద ఉన్న బోరు మోటారు గత కొన్ని రోజుల నుంచి మరమ్మత్తులకు గురయ్యాయి. వార్డులో నీటి ఎద్దడి ఏర్పడడంతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న స్థానిక కాంగ్రెస్ యువనాయకుడు దివిటి ఎల్లప్ప బోరు మోటార్ల మరమ్మత్తులు చేయించేందుకు ముందుకు వచ్చారు. తన సొంత ఖర్చులతో రెండు బోరు మోటార్లను మరమ్మత్తులు చేయించారు. దీంతో వార్డు ప్రజల నీటి సమస్య పరిష్కారం అయ్యింది. సొంత నిధులతో బోరు మోటార్లు మరమ్మత్తులు చేయించిన దివిటి ఎల్లప్పకు స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పటికే దివిటి ఎల్లప్ప వార్డులో పేదల అంత్యక్రియలకు సహాకారం అందిస్తున్న స్థానికుల మన్ననలు పొందుతున్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/36842/