schedule Monday, July 06, 2026

దివ్యాంగులకు సూపర్ చాన్స్..!

calendar_today July 15, 2025
person dharshininews
దివ్యాంగులకు సూపర్ చాన్స్..!
దివ్యాంగులకు సూపర్ చాన్స్..! - సొంతంగా వ్యాపారికి రుణాలు - రూ. 50లక్షలకు 100శాతం రాయితీ - అర్హుల నుంచి దరఖాస్తుల ఆహ్వానం వికారాబాద్, దర్శిని ప్రతినిధి : వికారాబాద్ జిల్లాలోని దివ్యాంగులకు అధికారులు సూపర్ చాన్స్ ప్రకటించారు. సొంతంగా వ్యాపారాలు చేసుకోవాలనే వారికి ఆర్థిక భరోసా అందించేందుకు ప్రభుత్వం నుంచి రుణాలు అందించడం జరుగుతుందని తెలిపారు. బ్యాంకు లింకేజీతో సంబంధం లేకుండా, లింకేజీలతో రాయితీ రుణాలు అందించడం జరగుతుందని తెలిపారు. పునరావాస పథకం కింద జిల్లాకు యూనిట్లను మంజూరు చేసిందని వెల్లడించారు. ఈ పధకం కింద బ్యాంకు లింకేజీ లేకుండా నేరుగా రూ.50 వేలతో 22 యూనిట్లు, బ్యాంకు లింకేజీతో రూ.లక్ష (1), రూ.2 లక్ష లు (1), రూ.3 లక్షలతో (1) యూనిట్లు మంజూరు చేయడం జరిగుతుందని పేర్కొన్నారు. అర్హత, ఆసక్తి ఉన్నవారు www.tgobmm s.cgg.gov.in వెబ్సైట్లో ఈనెల 14 నుంచి 31 వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అర్హతలు ఇవీ... అభ్యర్ధులకు వైకల్యం కనీసం 40 శాతం పైబడి ఉండాలి. 21 నుంచి 55 ఏళ్ల లోపువారు అర్హులు, అభ్యర్థుల వార్షికాదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.50 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.2 లక్షలు ఉండాలి. 5 ఏళ్లలలో ఈ పథకం కింద లబ్ది పొందకుండా ఉండాలి. వికలాంగుల సంక్షేమ శాఖ, ఇతర శాఖల నుంచి సబ్సిడీ పొంది ఉండకూడదు. దరఖాస్తు సమయంలో సదరం ద్రువీకరణ పత్రం, ఆధార్వార్డు ఇటీవల తీసుకున్న ఆదాయ ద్రువీకరణ పత్రం, కులం, నివాస ధ్రువీకరణ, వయస్సు నిర్ధారణ పత్రాలు, విద్యార్హత సర్టిఫికెట్లు పాస్ ఫొటో జత చేయాలని తెలిపారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/36848/