schedule Monday, July 06, 2026

చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి

calendar_today July 17, 2025
person dharshininews
చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి
చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి - తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి - సేవా భారతి, పోలీసు శాఖ ద్వారా డ్రగ్స్, ఫోక్సో చట్టంపై అవగాహన - పాల్గొన్న మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ కోట్రిక విజయలక్ష్మీ వెంకటయ్య తాండూరు, దర్శిని ప్రతినిధి : విద్యార్థులు, యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి అన్నారు. తాండూరు సేవా భారతి, పోలీసు శాఖ సంయుక్త ఆధ్వర్యంలో పట్టణంలోని ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో డ్రగ్స్, ఫోక్సో చట్టంపై ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. రెండో రోజు గురువారం కూడా సదస్సులు జరిగాయి. ఈ కార్యక్రమానికి తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి, మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ కోట్రిక విజయలక్ష్మి వెంకటయ్యతో పాటు కరణ్ కోట్ ఎస్ఐ విఠల్ రెడ్డిలు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేటి సమాజంలో విద్యార్థులు, యువతే మత్తుకు బానిసలు అవుతుండడం విచారకరమన్నారు. మత్తు పదార్థాలతో జీవితాలు నాశనమవుతాయని అన్నారు. వాటికి బానిసలైతే తేరుకోవడం కష్టమని అన్నారు. కావున విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలన్నారు. సెల్ ఫోన్ వినియోగం తగ్గించుకోవాలని, చదువుపై దృష్టిసారించాలన్నారు. అదేవిధంగా ఫోక్సో చట్టంపై అవాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సేవా భారతి సభ్యులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/36939/