schedule Thursday, September 10, 2026

బాకారం జైపాల్ రెడ్డి హాట్రిక్..!

calendar_today July 19, 2025
person dharshininews
బాకారం జైపాల్ రెడ్డి హాట్రిక్..!
kvcs బాకారం జైపాల్ రెడ్డి హాట్రిక్..! - పంచాయతీ రాజ్ మాస పత్రిక సంపాదకవర్గ సభ్యులుగా నియామకం - వరుసగా మూడో సారి ఎన్నిక పట్ల పీఆర్టీయూ టీఎస్ హర్షం - సన్మానించిన మండల అధ్యక్ష, కార్యదర్శులు జొన్నల వినోద్, పురుషోత్తం రెడ్డి తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : పంచాయతీ రాజ్ మాస పత్రిక సంపాదకవర్గ సభ్యులుగా తాండూరుకు చెందిన ఉపాధ్యాయులు, పీఆర్టీయూ నాయకులు బాకారం జైపాల్ రెడ్డి హాట్రిక్ సాధించారు. ఆయన వరుసంగా మూడో సారి నియామకం అయ్యారు. ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి, పీఆర్టీయూ టీఎస్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు చంద్రశేఖర్, ప్రధాన కార్యదర్శి దోమ అమర్ నాథ్ సహాకారంతో జైపాల్ రెడ్డి మూడో సారి పంచాయతీ రాజ్ మాస పత్రిక సంపాదకవర్గ సభ్యులుగా నియామకం అయ్యారు. ఈ సందర్భంగా తాండూరు మండల పీఆర్టీయూ శాఖ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. మూడో సారి నియామకం అయిన సందర్భంగా పీఆర్టీయూ మండల అధ్యక్షులు జోన్నల వినోద్ కుమార్, ప్రధాన కార్యదర్శి పట్లోళ్ల పురుషోత్తం రెడ్డిలు జైపాల్ రెడ్డిని కలిసి శాలువాతో సత్కరించారు. పూలమాల వేసి శుభాకాంక్షలు తెలిపారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/37006/