schedule Wednesday, September 09, 2026

కాంగ్రెస్ నేత ఇంటికి బీఎస్ఆర్

calendar_today July 20, 2025
person dharshininews
కాంగ్రెస్ నేత ఇంటికి బీఎస్ఆర్
కాంగ్రెస్ నేత ఇంటికి బీఎస్ఆర్ - హరిగౌడ్ నివాసంలో నేతల సందడి - శ్రీనివాస్ రెడ్డిని, నేతలకు సన్మానం తాండూరు, దర్శిని ప్రతినిది : తాండూరు మార్కెట్ కమిటి మాజీ డైరెక్టర్ హరిగౌడ్, మున్సిపల్ మాజీ కౌన్సిలర్ సరితా హరిగౌడ్ నివాసానికి కాంగ్రెస్ సీనీయర్ నాయకులు, ఆర్బీఓఎల్ సీఈఓ బుయ్యని శ్రీనివాస్ రెడ్డి(బీఎస్ఆర్) వెళ్లారు. ఆషాడం మాసం సందర్భంగా ఆదివారం సరితాగౌడ్, హరిగౌడ్ నివాసంలో అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇందులో భాగంగా ఆర్బీఓఎల్ సీఈఓ శ్రీనివాస్ రెడ్డి హరిగౌడ్ ఆహ్వానం మేరకు నివాసానికి వెళ్లారు. ఆయనతో పాటు టీపీసీసీ ప్రచార సమన్వయ కర్త కరణం పురుషోత్తం రావు, సీనీయర్ నాయకులు డా. సంపత్ కుమార్, యూత్ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు బంటు వేణుగోపాల్, యువనాయకులు వికాస్ జోషి, ఉపాధ్యాయులు జి. నర్సిరెడ్డి తదితరులు కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా సరితా హరిగౌడ్, హరిగౌడ్ నేతలను శాలువాలతో సత్కరించి సన్మానించారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/37019/