schedule Sunday, July 05, 2026

బోనాల ఉత్సవాల్లో బీఎస్ఆర్ సందడి

calendar_today July 20, 2025
person dharshininews
బోనాల ఉత్సవాల్లో బీఎస్ఆర్ సందడి
బోనాల ఉత్సవాల్లో బీఎస్ఆర్ సందడి - దేవాలయాల్లో అమ్మవార్ల దర్శనం, పూజలు - సన్మానించిన దేవాలయాల ప్రతినిధులు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలో ఆదివారం జరిగిన ఆషాడ బోనాల ఉత్సవాల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఆర్బీఓఎల్ సీఈఓ బుయ్యని శ్రీనివాస్ రెడ్డి సందడి చేశారు. తాండూరు పట్టణంలోని కాళీకాదేవీ దేవాయలంలో జాతర ఉత్సవాల్లో పాల్గొన్నారు. అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. అదేవిధంగా సాయిపూర్ ఆదర్శనగర్ కట్ట మైసమ్మ, గాంధీనగర్ కట్ట మైసమ్మల దేవాలయాలను సందర్శించారు. దేవాలయాల్లో అమ్మవార్లను దర్శించుకుని పూజలు నిర్వహించారు. ఆయా దేవాలయాల్లో అన్నదానం, ప్రత్యేక కార్యక్రమాల్లో పాల్పంచుకున్నారు. అనంతరం దేవాలయాల ప్రతినిధులు బుయ్యని శ్రీనివాస్ రెడ్డిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమాల్లో కాళికాదేవి దేవాయల చైర్మన్ బస్వరాజ్, ఈఓ నరేందర్, భద్రేశ్వర దేవాలయ చైర్మన్ పటేల్ కిరణ్ కుమార్, మాజీ మార్కెట్ కమిటి చైర్మన్ విఠల్ నాయక్, మాజీ కౌన్సిలర్లు ప్రభాకర్ గౌడ్, సంగీత అజయ్ సింగ్ ఠాకూర్, నాయకులు బంటు మల్లప్ప, బంటు వేణుగోపాల్, వికాస్ జోషి, ఆయా దేవాలయాల ప్రతినిధులు, యువజన సంఘం నాయకులు తదితరులు ఉన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/37024/