schedule Thursday, September 10, 2026

బోనం ఎత్తుకున్న న్యాయమూర్తి..!

calendar_today July 20, 2025
person dharshininews
బోనం ఎత్తుకున్న న్యాయమూర్తి..!
బోనం ఎత్తుకున్న న్యాయమూర్తి..! - కాళీకాదేవి అమ్మవారికి మొక్కులు - దేవాలయంలో తాండూరు జడ్జీ ప్రత్యేక పూజలు తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్ జిల్లా తాండూరు మున్సిఫ్ కోర్టు న్యాయమూర్తి శివలీల ఆషాడ బోనం ఎత్తుకున్నారు. ఆదివారం పట్టణంలోని కాళీకాదేవి దేవాలయంలో ఆషాడ బోనాల ఉతస్వాలు నిర్వహించారు. ఈ ఉత్సవాల్లో తాండూరు జడ్జి శివలీల బోనం ఎత్తుకుని హాజరయ్యారు. న్యాయమూర్తికి దేవాలయ చైర్మన్ పి.బస్వరాజ్, ఈఓ తాడెం నరేందర్, సభ్యులు ఘనంగా స్వాగతం పలికారు. న్యాయమూర్తి శివలీల బోనం ఎత్తుకుని దేవాలయం చుట్టూ ప్రదక్షణలు చేశారు. అనంతరం కాళికాదేవి అమ్మవారికి నైవేద్యం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం న్యాయమూర్తి ఆషాడం బోనాల ఉత్సవాలను సంప్రదాయ బద్దంగా జరుపుకోవడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/37033/