schedule Sunday, July 05, 2026

జీతాలు ఇప్పించండి కలెక్టర్ గారు..!

calendar_today July 23, 2025
person dharshininews
జీతాలు ఇప్పించండి కలెక్టర్ గారు..!
జీతాలు ఇప్పించండి కలెక్టర్ గారు..! - జిల్లా ఆసుపత్రి కాంట్రాక్టు సిబ్బంది మొర - కలెక్టర్‌కు వినతిప్రతం అందజేత తాండూరు, దర్శిని ప్రతినిధి : జీతాలు ఇప్పించడం కలెక్టర్ గారు.. అంటూ వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ ను తాండూరు ప్రభుత్వ జిల్లా ఆసుపత్రి కాంట్రాక్టు సిబ్బంది మొర పెట్టుకున్నారు. బుధవారం జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ తాండూరు ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిని సందర్శించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో పనిచేస్తున కాంట్రాక్టు సెక్యూరిటీ గార్డులు, సిబ్బంది జిల్లా కలెక్టర్ ను కలిశారు. గత 5నెలలుగా తమకు వేతనాలు చెల్లించడం లేదని, ఫీఎఫ్ కూడా సక్రమంగా అందించడం లేద కలెక్టర్ తో మొరపెట్టుకున్నారు. వేతనాలు రాక ఇబ్బందులు పడుతున్నామని, తమ సమస్యను పరిష్కరించేలా చూడాలని వినతి పత్రం అందించారు. ఇందుకు కలా ప్రతీక్ జైన్ సానుకూలంగా స్పందించి పరిశీలించి చర్యలు తీసుకుంటామని హామి ఇచ్చారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/37118/