schedule Sunday, July 05, 2026

చిలుక వాగు బ్రిడ్జితో ఇబ్బందులు దూరం

calendar_today July 23, 2025
person dharshininews
చిలుక వాగు బ్రిడ్జితో ఇబ్బందులు దూరం
చిలుక వాగు బ్రిడ్జితో ఇబ్బందులు దూరం - ముంపు ప్రాంతాల్లో వరద నీటికి పరిష్కారం - ఆర్బీఓఎల్ సీఈఓ బుయ్యని శ్రీనివాస్ రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం కోడంగల్ రోడ్డు మార్గంలో నిర్మిస్తున్న చిలుక వాగు బ్రిడ్జి అందుబాటులోకి రావడంతో వాహనదారులతో పాటు స్థానిక ప్రాంత ప్రజల ఇబ్బందులు దూరం కాబోతున్నాయని కాంగ్రెస్ నాయకులు, ఆర్బీఓఎల్ సీఈఓ బుయ్యని శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బుధవారం కోడంగల్ రోడ్డు మార్గంలో నిర్మించిన చిలుక వాగు బ్రిడ్జిని, మార్కండేయ కాలనీని సందర్శించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ గత కొన్నేళ్లుగా శిథిలావస్థకు చేరుకున్న చిలుక వాగు బ్రిడ్జిని పురోగతికి కృషి చేయడం జరిగిందన్నారు. రూ. 16 కోట్లతో బ్రిడ్జి నిర్మాణ పనులు చేపట్టడం జరిగిందన్నారు. తాండూరు మార్కెట్ కమిటి చైర్మన్ పట్లోళ్ల బాల్ రెడ్డి, పార్టీ నాయకులు వెంబడి ఉండి పనులు పూర్తి చేయించడం అభినందనీయమన్నారు. చిలుక వాగును పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకవచ్చేందుకు కృషి చేయడం జరుగుతుందన్నారు. ఈ చిలుక వాగు బ్రిడ్జి పూర్తి అయిన తరువాత, మార్కండేయ కాలనీ ప్రాంతంలో కూడా పనులు పూర్తి చేయించి ముంపు సమస్యలు రాకుండా చూస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ యువ నాయకులు వికాస్ జోషి, విష్ణు, కాలనీ పెద్దలు, యువకులు తదితరులు ఉన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/37124/