schedule Sunday, July 05, 2026

మెడికల్ కాలేజీ విద్యార్థులకు వసతి

calendar_today July 25, 2025
person dharshininews
మెడికల్ కాలేజీ విద్యార్థులకు వసతి
మెడికల్ కాలేజీ విద్యార్థులకు వసతి - తాండూరు మైనార్టీ బాయ్స్ హాస్టల్లో ఏర్పాటు - పనులు పరిశీలించిన మున్సిపల్ కమీషనర్‌ తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరులో త్వరలో ప్రారంభిస్తున్న కోడంగల్ మెడికల్ కాలేజీ విద్యార్థుల కోసం తాత్కాళిక వసతి గృహాన్ని సిద్ధం చేస్తున్నారు. తాండూరు పట్టణం హైదరాబాద్ రోడ్డు మార్గంలో ఉన్న మైనార్టీ బాయ్స్ హాస్టల్ ను మెడికల్ కాలేజీ విద్యార్థుల హాస్టల్ గా మారుస్తున్నారు. వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ ఆదేశాల మేరకు మున్సిపల్ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. శుక్రవారం మున్సిపల్ కమీషనర్ విక్రమ్ సింహారెడ్డి ఆదేశాలతో మున్సిపల్ కార్మికులు బాయ్స్ హాస్టల్ భవనంలో పారిశుద్ధ్య పనులు చేపట్టారు. ఈ పనులను కమీషనర్ విక్రమ్ సింహారెడ్డి పరిశీలించారు. ఇంచార్జ్ శానిటరీ ఇను స్పెక్టర్ వెంకటయ్య, మున్సిపల్ జవాన్లతో పనులు చేయించారు. అనంతరం కమీషనర్ మాట్లాడుతూ త్వరలో ప్రారంభించనున్న మెడికల్ కాలేజీ విద్యార్థుల కోసం మైనార్టీ బాయ్స్ హాస్టల్లో తాత్కాళిక వసతి ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. సుమారు 100 పడక సామర్థ్యం ఈ భవనంలో కల్పించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమాల్లో జవాన్లు రమేష్, సిహెచ్ అశోక్, బాలు, శ్రీనివాస్, సాయి తదితరులు ఉన్నారు. ఇదికూడా చదవండి.. https://www.dharshininews.com/37203/