schedule Sunday, July 05, 2026

ఇంట్లో విరబూసిన బ్రహ్మకమలం

calendar_today July 26, 2025
person dharshininews
ఇంట్లో విరబూసిన బ్రహ్మకమలం
ఇంట్లో విరబూసిన బ్రహ్మకమలం - పూజలు నిర్వహించిన కుటుంభీకులు - తాండూరు పట్టణంలో అద్బుతం తాండూరు, దర్శిని ప్రతినిధి: ఇంట్లో పవిత్రమైన బ్రహ్మ కమలం విరబూయడం ఎంతో శుభకరం. తాండూరు పట్టణం హేరూర్ వార్డులో నివాసం ఉంటున్న ప్రభుత్వ జూనియర్ కాలేజీ ఇంచార్జ్ ప్రిన్సిపల్ మల్లినాథప్ప కుటుంబ సభ్యులకు ఆ భాగ్యం కలిగింది. శుక్రవారం రాత్రి వారి నివాసంలో బ్రహ్మకమలం విరబూసింది. శ్రావణం మొదటి శుక్రవారం శివునికి ఇష్టమైన బ్రహ్మకమలం వికసించడంతో కుటుంబ సభ్యులు పూజలు నిర్వహించారు. తమ నివాసంలో బ్రహ్మకమలం వికసించడంపై సంతోషం వ్యక్తం చేశారు. ఇంటి పరిసర ప్రజలు ఈ అద్భుతానికి తన్మయంతో దర్శనం చేసుకున్నారు. అత్యంత పవిత్రమైన ఈ బ్రహ్మ కమలాలు హిమాలయాల్లోనే వికసిస్తాయని పండితులు చెబుతారు. రాత్రిళ్లు మాత్రమే విరబూస్తాయని అంటుంటారు. సాధారణంగా జులై నుంచి సెప్టెంబర్ మాసాల్లో మాత్రమే ఇవి వికస్తాయని చెబుతారు. ఇండ్లలలో బ్రహ్మకమలాలు విరబూయడం అద్బుత ఘట్టంగా నిలిచింది. ఇదికూడా చదవండి.... https://www.dharshininews.com/37210/