schedule Sunday, July 05, 2026

బీఆర్ఎస్‌తోనే మంచి రోజులు

calendar_today July 26, 2025
person dharshininews
బీఆర్ఎస్‌తోనే మంచి రోజులు
బీఆర్ఎస్‌తోనే మంచి రోజులు - కాంగ్రెస్ దుష్ప్రచారాలను తిప్పికొడతాం - శిక్షణ తరగతులకు హాజరైన బీఆర్ఎస్వీ నాయకులు తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీతోనే మంచి రోజులు వస్తాయని తాండూరు బీఆర్ఎస్వీ నాయకులు అన్నారు. శనివారం హైదరాబాద్ ఉప్పల్ పరిధి మల్లాపూర్ డివిజన్ లోని వీఎన్ఆర్ గార్డెన్ లో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్వీ శిక్షణ తరగతులకు మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఆదేశాల మేరకు తాండూరు నుంచి బీఆర్ఎస్వీ పట్టణ అధ్యక్షులు సందీప్ రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి దత్తాత్రేయరావు, వినోద్, తేజ, మమేష్, అనిల్ లు వెళ్లి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి సర్కారు అసత్యపు హామీలతో మోసం చేస్తోందని అన్నారు. మళ్లీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రజలకు మంచిరోజులు వస్తాయన్నారు. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న మోసాలను, బీఆర్ఎస్ పార్టీపై దుష్ప్రచారాలను తిప్పి కొడతామన్నారు. ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి బీఆర్ఎస్వీ సత్తా చూపిస్తామన్నారు. సమావేశంలో కేటీఆర్, హరీష్ రావుల ఆదేశాలతో ముందుకు సాగుతామన్నారు. ఇదికూడా చదవండి.. https://www.dharshininews.com/37233/