schedule Sunday, July 05, 2026

కేవీసీఎస్‌లో ఉప్పొంగిన దేశభక్తి...!

calendar_today July 26, 2025
person dharshininews
కేవీసీఎస్‌లో ఉప్పొంగిన దేశభక్తి...!
కేవీసీఎస్‌లో ఉప్పొంగిన దేశభక్తి...! - పాఠశాలలో ఘనంగా కార్గిల్ దివాస్ - దేశభక్తిని నింపిన విద్యార్థుల ప్రదర్శనలు - నివాళులు అర్పించిన ప్రిన్సిపల్, టీచర్లు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలోని పోటీ మహారాజ్ దేవాలయంలోని కృష్ణవేణి కాన్సెఫ్ట్ స్కూల్(కేవీసీఎస్)లో దేశభక్తి ఉప్పొంగింది. శనివారం కార్గిల్ విజయ్ దివాస్ ను పాఠశాల ప్రిన్సిపల్ ప్రశాంత్, డైరెక్టర్ సతీష్ ల ఆధ్వర్యంలో జరుపుకున్నారు. kvcs కార్గిల్ దివాస్ సందర్భంగా పాఠశాలకు చెందిన 8వ విద్యార్థులు ఆర్మీ జవాన్లు దేశరక్షణ కోసం ఎంత నిబద్దతో ఉంటారని ప్రదర్శనల ద్వారా వివరించారు. కార్గిల్ యుద్ధంపై నాటకం ప్రదర్శించారు. దేశ రక్షణలో భాగంగా అమరులైన జవాన్లకు పూలు వేసి నివాళులు అర్పించారు. ఈ ప్రదర్శనలో అక్కడివారిలో దేశభక్తి ఉప్పొంగేలా చేసింది. అదేవిధంగా ఆపరేషన్ సిందూర్ ప్రదర్శనలు కూడా ఇచ్చారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ ప్రశాంత్ మాట్లాడుతూ దేశం కోసం పోరాడిన కార్గిల్ జవాన్లను ఎన్నటికి మరువరాదన్నారు. కార్గిల్ పోరులో ప్రాణాలొదిలిన జవాన్లో నిజమైన దేశభక్తులని అన్నారు. కార్గిల్ దివాస్ సందర్భంగా వారికి నివాళులు అర్పించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో టీచర్లు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఇదికూడా చదవండి.. https://www.dharshininews.com/37245/