schedule Sunday, July 05, 2026

విద్యార్థులకు వసతి సమస్య తీర్చండి

calendar_today July 28, 2025
person dharshininews
విద్యార్థులకు వసతి సమస్య తీర్చండి
విద్యార్థులకు వసతి సమస్య తీర్చండి - తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డికి వినతి - ఎమ్మెల్యేను కలిసిన బషీరాబాద్ మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ తాండూరు, దర్శిని ప్రతినిధి : బషీరాబాద్ మండల కేంద్రంలోని మోడల్ స్కూల్ లోని విద్యార్థులకు వసతి సమస్యను పరిష్కరించాలని తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిని స్కూల్ ప్రిన్సిపల్ అనిల కోరారు. సోమవారం తాండూరు పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్ లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిని ప్రిన్సిపల్ కలిసి వినతిపత్రం అందించారు. ప్రస్తుతం మాడెల్ స్కూల్లో 400 మంది విద్యార్థులు చదువుకుంటున్నారని తెలిపారు. ఇంటర్ లో మరో 100 మంది చేరే అవకాశం ఉందని తెలిపారు. అయితే మోడల్ స్కూల్ విద్యార్థులకు వసతి గృహం లేకపోవడంతో విద్యార్థులకు ఇబ్బందులు ఎదురవుతున్నారని ఎమ్మెల్యే దృష్టికి తెచ్చారు. వసతిగృహాన్ని అందుబాటులోకి తెస్తే విద్యార్థులకు ఇబ్బందులు తొలగుతాయని, ముఖ్యంగా రవాణా ఇబ్బందులు దూరమవుతాయని తెలిపారు. ఇందుకు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సానకూలంగా స్పందించినట్లు ఆమె తెలిపారు. అన్ని వసతులతో వసతిగృహాన్ని అందుబాటులోకి తీసుకవచ్చేందుకు కృషి చేస్తామని హామి ఇచ్చినట్లు ప్రిన్సిపల్ అనిల తెలిపారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/37317/