schedule Sunday, July 05, 2026

హిందూ ఉత్సవ సమితికి మంచిరోజు..!

calendar_today August 1, 2025
person dharshininews
హిందూ ఉత్సవ సమితికి మంచిరోజు..!
హిందూ ఉత్సవ సమితికి మంచిరోజు..! - రేపు భవన నిర్మాణానికి శంకుస్థాపన - హాజరు కానున్న ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి - హిందూ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి పట్లోళ్ల నర్సింలు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు హిందూ ఉత్సవ సమితికి మంచి రోజు వచ్చింది. సమితికి నూతన భవనం త్వరలో అందుబాటులోకి రాబోతోంది. ఇందుకోసం రేపు హిందూ ఉత్సవ సమితి నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన చేపడుతున్నట్లు సమితి ప్రధాన కార్యదర్శి పట్లోళ్ల నర్సింలు, సభ్యులు తెలిపారు. kvcs శనివారం మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్ రోడ్డు మార్గంలోని హిందూ ఉత్సవ సమితి స్థలంలో కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. రూ.50లక్షలతో హిందూ ఉత్సవ సమితి నూతన భవన నిర్మాణంకు శంకుస్థాపన చేయడం జరుగుతుందన్నారు. సమితి భవన నిర్మాణంకు తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సహాకారంతో పాటు అన్ని సంఘాల సహాకారంతో హిందూ ఉత్సవ సమితికి కొత్త భవనం అందుబాటులోకి వస్తుందన్నారు. కావున రేపు జరిగే భవన శంకుస్తాపనకు హిందూ సంఘాలు, బందువులందరు పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇదికూడా చదవండి.. https://www.dharshininews.com/37360/