schedule Sunday, July 05, 2026

నాయకత్వంతోనే నైతిక విలువలు

calendar_today August 2, 2025
person dharshininews
నాయకత్వంతోనే నైతిక విలువలు
నాయకత్వంతోనే నైతిక విలువలు - అంకిత భావం, సంకల్పాలను నేర్పిస్తాయి - తాండూర కేవీసీఎస్ ప్రిన్సిపల్ ప్రశాంత్ - అట్టహాసంగా హెడ్ గర్ల్, హెడ్ బాయ్ల ప్రమాణ స్వీకారం తాండూరు, దర్శిని ప్రతినిధి : విద్యార్థులకు నాయకత్వ లక్షణాలు పెంపొందించుకుంటునే నైతిక విలువలు పెరుగుతాయని తాండూరు కృష్ణవేణి కాన్సెప్ట్ స్కూల్(కేవీసీఎస్) ప్రిన్సిపల్ ప్రశాంత్ అన్నారు. kvcs శనివారం స్కూల్లో గతంలో ఎన్నికైన హెడ్ గర్ల్, హెడ్ బాయ్స్ ల ప్రమాణ స్వీకారం అట్టహాసంగా జరిగింది. హెడ్ బాయ్, హెడ్ గర్ల్ తో పాటు అసిస్టెంట్ హెడ్ బాయ్, అసిస్టెంట్ హెడ్ గర్ల్, డిసిప్లీన్ సెక్రటరీ, కల్చరల్ సెక్రటరీ, లిటరేచర్ సెక్రటరీ, స్పోర్ట్స్ కెప్టెన్లు, రెడ్, ఎల్లో, బ్లూ, గ్రీన్ హౌస్ కెప్టెన్, వైస్ కెప్టెన్ లు కూడా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రిన్సిపల్ ప్రశాంత్ తో పాటు సభ్యులు ఎన్నికైన విద్యార్థులకు బ్యాడ్జిలు ప్రధానం చేసి శుభాకాంఓలు తెలిపారు. kvcs అనంతరం ప్రిన్సిపల్ ప్రశాంత్ మాట్లాడుతూ నాయకత్వం అంకితభావాలను, మంచి సంకల్పాన్ని నేర్పిస్తాయన్నారు. విద్యార్థులు నాయకత్వ బాధ్యతలను అప్పగించడం వల్ల నైతిక విలువలు పెరుగుతాయని, మంచి మార్గం చూపిస్తాయన్నారు. పాఠశాలలో స్కూల్ హెడ్ బాయ్, హెడ్ గర్ల్ లను అభినందించారు. అదేవిధంగా కొత్తగా ఎన్నికైన హెడ్ బాయ్, హెడ్ గర్ల్ లు మాట్లాడుతూ పాఠశాలలో నాయకత్వ బాధ్యతలను నిబద్ధతతో నిర్వహిస్తామని ప్రతిజ్ఞ చేస్తూ ఆకట్టుకున్నారు. దీంతో పాటు ప్రమాణ స్వీకారం సందర్భంగా పాఠశాలలో విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు సతీష్, మల్లేపల్లి వెంకటేశం, మల్లేశం, టీచర్లు, విద్యార్థులు పాల్గొన్నారు. ఇదికూడా చదవండి.. https://www.dharshininews.com/37387/