schedule Sunday, July 05, 2026

బంజారులు భక్తిమార్గంను ఎంచుకోవాలి

calendar_today August 3, 2025
person dharshininews
బంజారులు భక్తిమార్గంను ఎంచుకోవాలి
బంజారులు భక్తిమార్గంను ఎంచుకోవాలి - ప్రతి ఇంట్లో భోగ్ ఉత్సవాలు అభినందనీయం - ఏఎంసీ మాజీ చైర్మన్ విఠల్ నాయక్ తాండూరు, దర్శిని ప్రతినిధి : బంజారులు భక్తిమార్గం ఎంచుకుని ముందుకు సాగాలని తాండూరు మార్కెట్ కమిటి మాజీ చైర్మన్, వినాయక గ్రూప్స్ అధినేత వర్త్యా విఠల్ నాయక్ అన్నారు. శ్రావణమాసంను పురస్కరించుకుని బంజారులు అత్యంత భక్తిశ్రద్ధలతో భోగ్ ఉత్సవాలను నిర్వహించడం ఆనవాయితీ. ఇందులో భాగంగా ఆదివారం తాండూరు పట్టణంలో అనిల్ రాథోడ్ నివాసంలో భోగ్ ఉత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మార్కెట్ కమిటి మాజీ చైర్మన్ విఠల్ నాయక్ కర్ణాటక రాష్ట్ర సిక్వాడి గోర్ సేవా మిడియా కోఆర్డినేటర్ జాటోత్ నెహ్రు నాయక్, గోర్ సేవా ఉమ్మడి జిల్లా అధ్యక్షులు ధనావత్ రాందాస్ నాయక్ తదితరులతో కలిసి హాజరయ్యారు. kvcs ఈ సందర్భంగా బంజారుల ఆరాధ్య దైవం సేవాలాల్ మహరాజ్ ను స్మరించుకుని పూజలు నిర్వహించారు. అనంతరం విఠల్ నాయక్ మాట్లాడుతూ బంజారులు భక్తిమార్గంను ఎంచుకుని ముందుకు సాగాలన్నారు. శ్రావణమాసంలో ప్రతి ఇంట్లో భోగ్ ఉత్సవాలను నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో బంజార సమాజం సభ్యులు అనిల్ రాథోడ్, గోపాల్ చౌహాన్, వికారాబాద్ జిల్లా గోర్ సిక్వాడి నసాభీ ఆంగోత్ గోపాల్ నాయక్, కార్యకర్తలు చవాన్ చందర్ నాయక్, రాము జాదవ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/37399/