schedule Sunday, July 05, 2026

మనోహరన్న మంచిగుండాలే..!

calendar_today August 5, 2025
person dharshininews
మనోహరన్న మంచిగుండాలే..!
మనోహరన్న మంచిగుండాలే..! - తుల్జాపూర్‌లో కాంగ్రెస్ నేతల పూజలు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి నిండు నూరేళ్లు మంచిగా ఉండాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆకాంక్షించారు. మంగళవారం ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి జన్మదినం సందర్భంగా తాండూరు పట్టణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ జనరల్ సెక్రటరీ రాములు తుల్జాపూర్‌లో వెలసిన భవానీ మాత ఆలయంలో పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఆరోగ్యంగా ఉండాలని, సుఖసంతోషాలతో జీవించి ఉన్నత పదవులు అధిరోహించాలని అమ్మవారిని ప్రార్థించారు. ఇప్పటికే తాండూరు ఎమ్మెల్యేగా నియోజకవర్గ అభివృద్దికి మనోహర్ రెడ్డి ఎంతో కృషి చేస్తున్నారని అన్నారు. అభివృద్ధితో పాటు పేదలకు సంక్షేమ పథకాలు అందేలా చొరవ చూపుతున్నారని కొనియాడారు. రానున్న రోజుల్లో తాండూరును ఆదర్శంగా నిలుపుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రాములుతో పాటు ఆయన మిత్ర బృందం పాల్గొన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/37415/