కాంగ్రెస్ హాయాంలోనే పేదలకు లబ్ది
August 6, 2025
dharshininews
కాంగ్రెస్ హాయాంలోనే పేదలకు లబ్ది
- కొత్త కార్డుల మంజూరుతో ఎంతో మేలు
- డీబీఎంసీ మెంబర్ కిరణ్ కుమార్
తాండూరు, దర్శిని ప్రతినిధి : కాంగ్రెస్ ప్రభుత్వ హాయాంలోనే నిరుపేదలకు ఎంతో లబ్ది చేకూరుతోందని పెద్దేముల్ మండలం కందనెల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, డీవీఎంసీ మెంబర్ కిరణ్ కుమార్ అన్నారు.
బుధవారం గ్రామంలో కొత్త రేషన్ కార్డుల పంపిణీ చేపట్టారు. ఈ సందర్బంగా కిరణ్ కుమార్ గ్రామానికి చెందిన నేతలతో కలిసి కొత్త రేషన్ కార్డులు మంజూరైన లబ్దిదారులకు కార్డులు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో పేదలకు రేషన్ కార్డులు అందించలేదని అన్నారు.
మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాతే కొత్త రేషన్ కార్డుల పంపిణీ జరిగిందన్నారు. గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడే పేదలకు ఇందిరమ్మ ఇళ్లు, ఆరోగ్య శ్రీ వంటి ఎన్నో పథకాలు అమలు చేయడం జరిగిందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో పేదల కోసం మళ్లీ ఇందిరమ్మ రాజ్యం వచ్చిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు అందిస్తుందని అన్నారు.
అదేవిధంగా ఇళ్లులేని పేదలకు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తుందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో పేదలందరికి ఎంతో మేలు జరుగుతోందని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు మధుసూదన్ రెడ్డి, ముఖ్య నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.
ఇదికూడా చదవండి..
https://www.dharshininews.com/37459/