schedule Sunday, July 05, 2026

సబితారెడ్డిపై దౌర్జన్యం దుర్మార్గం..!

calendar_today August 6, 2025
person dharshininews
సబితారెడ్డిపై దౌర్జన్యం దుర్మార్గం..!
సబితారెడ్డిపై దౌర్జన్యం దుర్మార్గం..! - కాంగ్రెస్ నేతల తీరు అసమంజసమే - బీఆర్ఎస్ ఎమ్మెల్యే, నేతల జోలికొస్తే ఖబడ్డార్ - జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రాజుగౌడ్ - దాడిని ఖండించిన తాండూరు బీఆర్ఎస్ నేతలు తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి, ఉమ్మడి రాష్ట్ర మాజీ హోం శాఖ మంత్రి పట్లోళ్ల సబితా ఇంద్రారెడ్డిపై కాంగ్రెస్ నేతలు దౌర్జన్యానికి పాల్పడడం దుర్మార్గమని బీఆర్ఎస్ పార్టీ నాయకులు, వికారాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రాజుగౌడ్ మండిపడ్డారు. kvcs బుధవారం ఆయన తాండూరులో మీడియాతో మాట్లాడారు. మహేశ్వరం నియోజకవర్గం బాలాపూర్ లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంగా నిర్వహించిన రేషన్ కార్డుల పంపిణీలో మాజీ మంత్రి సబితారెడ్డి స్థానిక ఎమ్మెల్యే హోదాలో పాల్గొన్నారని గుర్తుచె శారు. అయితే కార్యక్రమానికి హాజరైన ఉమ్మడి జిల్లా ఇంచార్జ్ మంత్రి శ్రీధర్ బాబు, చీఫ్ విఫ్ మహేందర్ రెడ్డిల సమక్షంలో సబితారెడ్డిని అగౌరవ పరిచేలా కాంగ్రెస్ నేతలు వ్యవహించడం సమంజసం కాదన్నారు. సబితారెడ్డికి పై దౌర్జన్యానికి పాల్పడడం దుర్మార్గమన్నారు. తెలంగాణ రాష్ట్రానికి, ఉమ్మడి జిల్లాకు సబితారెడ్డి ఎన్నో సేవలు అందించారని, తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి కూడా తోడ్పాటు అందించారని గుర్తుచేశారు. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే. మహిళ ఎమ్మెల్యే అని చూడకుండా వ్యవహరించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పార్టీ నేతలు, ఎమ్మెల్యేల పట్ల ఇదేవిధంగా వ్యవహరిస్తూ ఊరుకునేది లేదని ఖబడ్డార్ అంటూ హెచ్చరించారు. పైలెట్ వస్తాడు.. మరోవైపు తాండూరు నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీపై కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తాండూరు మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి బీజేపీలో చేరుతున్నారని కొందరు అసత్య ప్రచారాలు చేస్తున్నారని అన్నారు. అలాంటి నేతలకు తగిన గుణపాఠం తప్పదన్నారు. త్వరలోనే పైలెట్ రోహిత్ రెడ్డి వస్తారని, బీఆర్ఎస్ పార్టీని వీడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పార్టీపై తప్పుడు ప్రచారాలను మానుకోవాలని, లేదంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి అబ్దుల్ సలీం, మాజీ ఫ్లోర్ లీడర్ సుమిత్ గౌడ్, నాయకులు ఈర్షాద్, ఎర్రం శ్రీధర్, దత్తాత్రేయ రావు తదితరులు పాల్గొన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/37462/