schedule Sunday, July 05, 2026

రక్షా బంధన్ జోష్..!

calendar_today August 8, 2025
person dharshininews
రక్షా బంధన్ జోష్..!
రక్షా బంధన్ జోష్..! - ఎస్‌కేటీఎస్ ఆధ్వర్యంలో ఉత్సహాంగా సంబరాలు - అధికారులకు రాఖీలు కట్టిన విద్యార్థులు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం సాయిపూర్ రోడ్డు మార్గంలోని శ్రీ కృష్ణవేణి టాలెంట్ స్కూల్(ఎస్‌కేటీఎస్) విద్యార్థులు రక్షా బంధన్ జోష్ నింపారు. రాఖీ పండగను పురస్కరించుకుని ఒకరోజు ముందు పండగ సంబరాలు జరుపుకున్నారు. ఇందులో భాగంగా ప్రతి యేడాది మాదిరిగానే అధికారులకు రాఖీలు కట్టారు. నీవు నాకు రక్ష - నేను నీకు రక్ష - మనందరం దేశానికి రక్ష అనే నినాదంతో భరోసా అందిపుచ్చుకున్నారు. ముందుగా తాండూరు సబ్ కలెక్టర్ ఉమా శంకర్ ప్రసాద్ కు రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి, తహసీల్దార్ తారాసింగ్, పట్టణ సీఐ సంతోష్ కుమార్, మున్సిపల్ కమీషనర్ విక్రమ్ సింహారెడ్డి, ఇంచార్జ్ ఎంపీడీఓ సుశీల్ కుమార్, ఆర్టీసీ డీపో మేనేజర్ సురేష్ కుమార్ లకు రాఖీలు కట్టారు. అంతకుముందే పాఠశాల చైర్మన్ విద్యావరి విష్ణువర్ధన్ రెడ్డి, కరస్పాండెంట్ పట్లోళ్ల సర్వోత్తమ్ రెడ్డి, డైరెక్టర్ ద్యావరి జయవర్ధన్ రెడ్డి, ప్రిన్సిపల్ ఎన్.రమేష్, ఉపాధ్యాయులకు విద్యార్థులు రాఖీలు కట్టారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ మన సంస్కృతి, సంప్రదాయాలు భావితరాలకు తెలిసేవిధంగా పండగలను జరుపుకోవడం సంతోషకరమని, విద్యార్థులను అభినందించారు. పాఠశాల చైర్మన్, కరస్పాండెంట్, డైరెక్టర్ లు మాట్లాడుతూ పాఠశాలలో విద్యార్థులకు విద్యతో పాటు సంస్కృతి సంప్రదాయాల విలువలపై చైతన్య కల్పిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రతినిధులు టీచర్లు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/37517/