schedule Wednesday, September 09, 2026

రామందిర్ పునర్ నిర్మాణానికి చేయూత

calendar_today August 10, 2025
person dharshininews
రామందిర్ పునర్ నిర్మాణానికి చేయూత
రామందిర్ పునర్ నిర్మాణానికి చేయూత - రూ.51 వేలు అందించిన మాజీ కౌన్సిలర్ శ్రీనివాస్ - అభినందించిన దేవాలయ కమిటి సభ్యులు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం ఇందిరానగర్ లోని ఏకైక రామ మందిరం పునర్ నిర్మాణానికి మాజీ కౌన్సిలర్ శ్రీనివాస్ చేయూత అందించారు. kvcs గత కొన్ని రోజులుగా రామ మందిర పునర్ నిర్మాణ పనులు చేపడుతున్న సంగతి తెలిసిందే. పునర్ నిర్మాణానికి దాతలు తమ వంతు సహాకారంను అందిస్తున్నారు. ఇందులో భాగంగా 6వ వార్డు మాజీ కౌన్సిలర్ శ్రీనివాస్ దేవాలయ పునర్ నిర్మాణానికి చేయూతనందించారు. తనవంతుగా దేవాలయానికి రూ. 51 వేలను అందజేశారు. ఈ సందర్భంగా దేవాలయ కమిటి సభ్యులు శ్రీనివాస్ ను అభినందించారు. అదేవిధంగా దేవాలయ పునర్ నిర్మాణానికి దాతలు ముందుకు వచ్చి తమ వంతుగా ఆర్థిక సాయం, లేదా వస్తువు రూపంలో సహాకారం అందించాలని కమిటి సభ్యులు కోరారు. దాతలందరికి ఆ శ్రీరాముడి ఆశీస్సులు మెండుగా ఉంటాయని అన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/37591/