రైతు బీమాకు మళ్లీ చాన్స్..!
August 10, 2025
dharshininews
రైతు బీమాకు మళ్లీ చాన్స్..!
- దరఖాస్తులకు రైతుల నుంచి ఆహ్వానం
- అర్హతలు, దరఖాస్తుల గడువు తేది ఇదే..
తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు బీమా పథకానికి రైతుల నుంచి మళ్లీ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా వ్యవసాయ శాఖ అధికారి రాజారత్నం తెలిపారు.
ఇప్పటికే భూములు కలిగి ఉండి బీమాకు దరఖాస్తు చేసుకోలేని రైతులతో పాటు కొత్తగా భూములు కొనుగోలు చేసిన రైతుల నుంచి దరఖాస్తులను కోరడం జరుగుతుందన్నారు. 2025 జూన్ 5 నాటి భూములు కలిగిన రైతులు, 1966 నుంచి 2007 మద్య జన్మించిన రైతులు రైతు బీమా పథకాని అర్హులని చెప్పారు.
దరఖాస్తు కోసం రైతు ఆధార్ కార్డు జిరాక్స్, రైతు భూమి పాసుపుస్తకం జిరాక్స్, నామిని ఆధార్ కార్డు జిరాక్సులతో వ్యవసాయ విస్తీర్ణ అధికారులను సంప్రదించాలని సూచించారు. ఈనెల 13వ తేదిలోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. అంతేకాకుండా గతంలో చేసుకున్న రైతు బీమా దరఖాస్తుల్లో మార్పులు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు స్పష్టం చేశారు.
రైతు బీమాలో రైతుల పేర్లు గాని, నామిని పేరు గాని మార్పు చేసుకోవచ్చని, ఇందుకు ఈనెల. 12వ తేది వరకు గడువు ఉంటుందన్నారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఇదికూడా చదవండి...
https://www.dharshininews.com/37594/