schedule Thursday, September 10, 2026

రొంపల్లికి అభినందనల వెల్లువ

calendar_today August 10, 2025
person dharshininews
రొంపల్లికి అభినందనల వెల్లువ
రొంపల్లికి అభినందనల వెల్లువ - సన్మానించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు - శుభాకాంక్షలు తెలిపిన బాస్పల్లి రాజు మిత్ర బృందం తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరుకు చెందిన యువనాయకుల, సామాజిక వేత్త రొంపల్లి సంతోష్‌ కుమార్ గుప్తకు శుభాకాంక్షల వెల్లువ కొనసాగుతోంది. kvcs తాండూరు హిందూ ఉత్సవ సమితి కోశాధికారిగా ఏకగ్రీవంగా రొంపల్లి సంతోష్ కుమార్ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా కురుమ సంఘం, ఆర్యవైశ్య సంఘం, ఇతర సంఘాల నాయకులు సన్మానించారు. తాజాగా ఆదివారం తాండూరు మండలం బాస్పల్లికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు రొంపల్లి సంతోష్ కుమార్‌ను సన్మానించారు. కాంగ్రెస్ పార్టీ యువనాయకులు రాజు మిత్ర బృందం సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ రొంపల్లి సంతోష్‌ కుమార్ హిందూ ఉత్సవ సమితికి పేరు తెచ్చే విధంగా పనిచేయాలని ఆకాంక్షించారు. అదేవిధంగా రొంపల్లి సంతోష్‌ కుమార్ మాట్లాడుతూ అందరి ఆదరాభిమానాలకు కృతజ్ఞతలు తెలిపారు. అందరి సహాకారంతో హిందూ ఉత్సవ సమితికి సహాకారం అందిస్తానని అన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/37603/