schedule Wednesday, September 09, 2026

చిన్నారుల ఆరోగ్య రక్షణ అందరి బాధ్యత

calendar_today August 11, 2025
person dharshininews
చిన్నారుల ఆరోగ్య రక్షణ అందరి బాధ్యత
చిన్నారుల ఆరోగ్య రక్షణ అందరి బాధ్యత - పిల్లలకు నులిపురుగుల మాత్రలు వేయించాలి - మున్సిపల్ మాజీ కౌన్సిలర్ సంగీత ఠాకూర్ తాండూరు, దర్శిని ప్రతినిధి : చిన్నారులను ఆరోగ్యంగా ఉంచాల్సిన బాధ్యత అందరిపై ఉందని తాండూరు మున్సిపల్ 20వ వార్డు మాజీ కౌన్సిలర్ సంగీత అజయ్ సింగ్ ఠాకూర్ అన్నారు. kvcs సోమవారం జాతీయ నులిపురుగుల నియంత్రణ దినోత్సవం సందర్భంగా గాంధీనగర్ లోని ప్రాథమిక పాఠశాలలో కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సంగీత ఠాకూర్ వైద్య సిబ్బందితో కలిసి పాఠశాలలోని విద్యార్థులకు నులిపురుగుల మాత్రలను వేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ పిల్లల్లో నులిపురుగుల వల్ల కడుపునొప్పి, రక్తహీనత, పోషకాల లోపం, ఆకలి మందగించడం, బలహీనత వంటి సమస్యలు ఎదురవుతాయన్నారు. కావున నులిపురుగులను నియంత్రించేందుకు 1-19 ఏండ్లు ఉన్న వారికి అల్బెండజోల్ మాత్రలు తప్పక వేయించాలన్నారు. పిల్లల ఆరోగ్యంపై దృష్టిసారించడం అందరి బాధ్యత అని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ నాగదేవి, టీచర్లు జగదీశ్వరి, డా. రాజేశ్వరి, ఏఎన్ఎం శాంత, ఆశ వర్కర్ సుజాత, విద్యార్థులు పాల్గొన్నారు.   ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/37616/