schedule Sunday, July 05, 2026

ఇష్టారాజ్యంగా ఇసుక దోపిడి..!

calendar_today August 11, 2025
person dharshininews
ఇష్టారాజ్యంగా ఇసుక దోపిడి..!
ఇష్టారాజ్యంగా ఇసుక దోపిడి..! - కక్రవేణి నది నుంచి ఇసుక పర్మిట్లు - పంటలకు, ప్రాజెక్టుకు పొంచి ఉన్న ప్రమాదం - జిల్లా కలెక్టర్ కు విశ్వనాథ్ పూర్ గ్రామస్తుల ఫిర్యాదు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు నియోజకవర్గం యాలాల మండలంలోని విశ్వనాథ్ పూర్ గ్రామ పరిధిలో నుంచి కక్రవేణి నది నుంచి ఇసుక దోపిడి ఇష్టారాజ్యంగా కొనసాగుతోందని గ్రామస్తులు వికారాబాద్ జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. kvcs సోమవారం వికారాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ప్రజావాణిలో గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. స్వయంగా కలెక్టర్ ప్రతీక్ జైన్ ను కలిసి సమస్యను వివరించారు. గత కొన్ని రోజులుగా కక్రవేణి నది సమీపంలో నుంచి ఇసుక తరలింపులకు మండల తహసీల్దార్ ఇసుక పర్మిట్లను జారీ చేస్తున్నారని తెలిపారు. అనుమతులు పొందిన కాంట్రాక్టు అక్రమంగా ఇసుక తరలింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. శివసాగర్ ప్రాజెక్టు కింది ఇసుకను తోడేస్తున్నారని తెలిపారు. అదేవిధంగా ఇసుక తరలింపుల వల్ల బోరు బావుల్లో భూగర్భ జలాలు తగ్గిపోయతున్నారని, దీంతో పంటలు ఎ ండిపోతున్నాయని ఆవేధన వ్యక్తం చేశారు. ఇటు పంటలతో పాటు ఇసుక తరలింపు వల్ల శివసాగర్ ప్రాజెక్టు చెక్ డ్యాంకు ప్రమాదం జరిగే అవకాశం ఉందని కలెక్టర్ దృష్టికి తెచ్చారు. కావున కక్రవేణి నది నుంచి ఇసుక అనుమతులు ఇవ్వకుండా తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ను కోరారు. ఈ కార్యక్రమంలో యాలాల మాజీ జెడ్పీటీసీ సిద్రాల శ్రీనివాస్, గ్రామస్తులు, రైతులు ఉన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/37620/