విద్యార్థుల మనసు గెలిచిన ఆర్ఎస్‌కే ఫౌండేషన్
August 13, 2025
dharshininews
విద్యార్థుల మనసు గెలిచిన ఆర్ఎస్‌కే ఫౌండేషన్
- చేయూతనిచ్చిన ఫౌండేషన్ తొలి సేవా కార్యక్రమం
- పేద విద్యార్థులకు టై, బెల్టుల వితరణ
- వీసీఐ వైస్ చైర్మన్ జూలూరి రమేష్ బాబుతో కలిసి రొంపల్లి సంతోష్ కుమార్ పంపిణీ
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరుకు చెందిన రొంపల్లి సంతోష్ కుమార్ చైర్మన్‌గా ఏర్పాటు చేసిన ఆర్ఎస్‌కే ఫౌండేషన్ ద్వారా చేపట్టిన సేవా కార్యక్రమం విద్యార్థుల మనస్సును గెలుచుకుంది.
ఆర్ఎస్‌కే ఫౌండేషన్ తరుపున బుధవారం తొలి కార్యక్రమంలో సేవా తత్పరతను చాటుకుంది. పెద్దేముల్ మండలం ఇందూరు జెడ్పీహెచ్‌ఎస్ పాఠశాలలో విద్యార్థులకు చేయూతను అందించారు. ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవంను పురస్కరించుకుని వాసవీ క్లబ్ ఇంటర్నేషనల్ సీనీయర్ వైస్ చైర్మన్ జూలూరి రమేష్ బాబు సహాకారంతో పాఠశాలలోని 250 మంది విద్యార్థులకు టైలు, బెల్టులు పంపిణీ చేశారు.
జూలూరీ రమేష్ బాబుతో కలిసి ఆర్ఎస్‌కే ఫౌండేషన్ చైర్మన్ రొంపల్లి సంతోష్ కుమార్ విద్యార్థులకు అందజేశారు. ఈ సందర్భంగా రొంపల్లి సంతోష్ కుమార్ మాట్లాడుతూ తమ ఫౌండేషన్ ద్వారా తొలి కార్యక్రమంగా విద్యార్థులకు చేయూత అందించడం సంతోషకరంగా ఉందన్నారు. భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ వైస్ గవర్నర్ కలిమిచర్ల రమేష్, ఆగీరు మహేష్, సోమశేఖర్, పాఠశాల హెచ్ఎం, టీచర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.
ఇదికూడా చదవండి...
https://www.dharshininews.com/37709/