schedule Sunday, July 05, 2026

వరణుడి విశ్వరూపం..!

calendar_today August 14, 2025
person dharshininews
వరణుడి విశ్వరూపం..!
వరణుడి విశ్వరూపం..! - తాండూరులో దంచికొట్టిన వాన - నియోజకవర్గంలో పొంగి పొర్లిన వాగులు - నిండా మునిగిన తాండూరు కాగ్నా నది - అలుగు పారిన జుంటుపల్లి ప్రాజెక్టు - జీవన్గీ మహదేవుడికి పోటెత్తిన వరధ - జలదిగ్బంధమైన తాండూరు మండలం - తాండూరు నియోజకవర్గ పరిస్థితి ఇదే తాండూరు, దర్శిని ప్రతినిధి : వరణుడు విశ్వరూపం చూపించాడు. బుధవారం, గురువారం తాండూరులో భారీ వర్షాలు దంచికొట్టాయి. kvcs ఈ వర్షాలతో నియోజకవర్గంలోని కాగ్నానది. వాగులు, ప్రాజెక్టులు ఉప్పొంగి ప్రవహించాయి. వాగులు ఉప్పొంగడంతో పలు గ్రామాలు జలదిగ్బంధమయ్యాయి. పలు గ్రామాల్లో పంటలు నీటమునిగాయి. భారీ వర్షాల నేపథ్యంలో ప్రభుత్వ శాఖల అధికారులు అప్రమత్తమయ్యారు. తాండూరు కోడంగల్ రోడ్డు మార్గంలోని కాగ్నానదికి వరదనీరు పోటేత్తింది. నదిపై ఉన్న పాత వంతెన పూర్తిగా మునిగిపోయింది. కొత్త వంతెనకు అనుకునేంతలా వరధనీరు ప్రవహించింది. తాండూరు మండలంలో భారీ వర్షాల కారణంగా పలు గ్రామాలు జలదిగ్బంధం అయ్యాయి. మండలంలోని బొంకూరు, బిజ్వార్ గ్రామాల మద్యలోని కాగ్నానది ఉదృతంగా ప్రవహించడంతో రెండు గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. వీర్ శెట్టిపల్లి గ్రామం చుట్టూ వరద నీరు ప్రవహించడంతో చిన్నపాటి దీవిలా మారిపోయింది. అదేవిధంగా మండలంలోని అల్లాపూర్, ఆయినెల్లి, మల్కాపూర్. సంగెంకలాన్, బెల్కటూర్ తదితర గ్రామాల్లోని వాగులు పొంగిపోర్లండంతో ఇబ్బందులు ఎదురయ్యాయి. భారీ వర్షాల కారణంగా ఎక్కడి గ్రామాల ప్రజలు అక్కడే ఉండిపోయారు. మరోవైపు యాలాల మండలంలో భారీ వర్షాల ప్రభావం కనిపించింది. మండలంలోని జుంటుపల్లి వాగుకు ప్రాజెక్టు అలుగు పారింది. భారీ వరద నీరుతో ప్రాజెక్టుకు జలకళ సంతరించుకుంది. అదేవిధంగా కోడంగల్ నియోజకవర్గం నాగారం, రుద్రారం, పటేల్ చింత తాండా రోడ్డుకు భారీ కోత ఏర్పడడంతో రాకపోకలకు ఇబ్బందులు ఎదురయ్యాయి. మండలంలోని పగిడిపల్లి గ్రామానికి చెందిన కొండి మల్లప్ప, రాములులకు చెందిన 6 ఎకరాల వరి పంట నీటమునిగి పోయింది. దీంతో వారికి నష్టం ఏర్పడింది. బషీరాబాద్ మండంలో కూడా భారీ వర్షాలు కురిశాయి. ఈ భారీ వర్షానికి మండలంలోని జీవనీ మహదేవ దేవాలయంకు వరద నీరు పోటేత్తింది. దేవాలయం వరద నీటిలో ముని గిపోయింది. జీవనీ గ్రామంలోని ఎస్సీ కాలనీలో మళ్లీ వరద నీరు చేరింది. అదేవిధంగా పలుగ్రామాల ప్రజలు భారీ వర్షంతో ఇబ్బందులు పడ్డారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/37718/