schedule Sunday, July 05, 2026

రామందిరానికి ఉద్యోగి చేయూత

calendar_today August 15, 2025
person dharshininews
రామందిరానికి ఉద్యోగి చేయూత
రామందిరానికి ఉద్యోగి చేయూత - రూ.50 వేలు అందించిన విద్యుత్ ఉద్యోగి - అభినందించిన దేవాలయ కమిటి సభ్యులు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం ఇందిరానగర్ లోని ఏకైక రామ మందిరం పునర్ నిర్మాణానికి విద్యుత్ ఉద్యోగి చేయూత అందించారు. గత కొన్ని రోజులుగా రామ మందిర పునర్ నిర్మాణ పనులు చేపడుతున్న సంగతి తెలిసిందే. kvcs పునర్ నిర్మాణానికి దాతలు తమ వంతు సహాకారంను అందిస్తున్నారు. ఇందులో భాగంగా విద్యుత్ శాఖ సీనియర్ అసిస్టెంట్ రవీందర్ నాయక్ దేవాలయ పునర్ నిర్మాణానికి చేయూతనందించారు. దేవాలయంలో ఏర్పాటు చేస్తున్న ఆలయ ద్వారం కోసం తనవంతుగా దేవాలయానికి రూ. 50 వేలను అందజేశారు. ఈ సందర్భంగా దేవాలయ కమిటి సభ్యులు రవీందర్ నాయక్‌ను అభినందించారు. అదేవిధంగా దేవాలయ పునర్ నిర్మాణానికి దాతలు ముందుకు వచ్చి తమ వంతుగా ఆర్థిక సాయం, లేదా వస్తువు రూపంలో సహాకారం అందించాలని కమిటి సభ్యులు కోరారు. దాతలందరికి ఆ శ్రీరాముడి ఆశీస్సులు మెండుగా ఉంటాయని అన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/37765/