schedule Sunday, July 05, 2026

సహాకారం పొడగింపు హర్షణీయం

calendar_today August 15, 2025
person dharshininews
సహాకారం పొడగింపు హర్షణీయం
సహాకారం పొడగింపు హర్షణీయం - సంఘాలను ప్రగతిబాట పట్టిస్తాం - డీసీసీబీ జిల్లా వైస్ చైర్మన్ రవీందర్ గౌడ్ తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : జిల్లాలో సహాకార సంఘాల పదవి కాలం పొడగింపు హర్షణీయమని ఉమ్మడి జిల్లా డీసీసీబీ వైస్ చైర్మన్ సంగెం రవీందర్ గౌడ్ అన్నారు. శుక్రవారం తాండూరులోని ఎల్మకన్నె సహాకార సంఘం కార్యాలయంలో జెండా ఆవిష్కరణ అనంతరం రవీందర్ మీడియాతో మాట్లాడారు. kvcs పదవి కాలం ముగిసిన సహకార సంఘాల పాలకవర్గానికి మరో ఆరు నెలలు గడవు పొడగించడం సంతోషకరమన్నారు. ఇందుకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి తుమ్ముల నాగేశ్వర రావు, తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం సహాకార సంఘాల పదవి కాలం రెండో సారి ఆరు నెలలు పొడగింపు చేయడం జరిగిందన్నారు. పదవి కాలం పొడగింపుతో సంఘాలను అందరి సహకారంతో ప్రగతి బాట పట్టించేందుకు కృషి చేస్తామన్నారు. రైతులకు మెరుగైన సేవలు అందింది.. మరింత బలో పేతం చేసే దిశగా ముందుకు సాగుతామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎల్మకన్నె సహాకార సంఘం వైస్ చైర్మన్, డైరెక్టర్లు పాల్గొన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/37781/