schedule Sunday, July 05, 2026

కేవీసీఎస్‌లో ఘనంగా గోకులాష్టమి

calendar_today August 16, 2025
person dharshininews
కేవీసీఎస్‌లో ఘనంగా గోకులాష్టమి
kvcs జై.. బోలో శ్రీ కృష్ణా..! - కేవీసీఎస్‌లో ఘనంగా గోకులాష్టమి - అలరించిన శ్రీ కృష్ణ, గొల్ల భామలు - ఉత్సహాభరితంగా కృష్ణాష్టమి సంబరాలు తాండూరు, దర్శిని ప్రతినిధి : జై.. శ్రీకృష్ణా, జై బోలో శ్రీ కృష్ణా అంటూ తాండూరు పట్టణంలోని క్రిష్ణవేణీ కాన్సెప్ట్ స్కూల్లో మార్మోగింది. శనివారం స్కూల్లో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు వైభవంగా జరిగాయి. kvcs గోకులాష్టమి సందర్భంగా స్కూల్ విద్యార్థులు చిన్ని కృష్ణులతో పాటు గోపికలుగా సందడి చేశారు. కృష్ణాష్టమి సందర్భంగా చిన్నారులు నల్లన్నయ్యలుగా.. యశోధ.. గోపికలుగా అలంకరించారు. శ్రీకృష్ణులు, గోపికల ఆట పాటలతో శ్రీకృష్ణాష్టమి వేడుకలు వైభవంగా జరిగాయి. 9వ తరగతి విద్యార్థులు చేసిన నృత్య ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఉట్టి కొట్టే కార్యక్రమంలో కేరింతలు దద్దరిల్లిపోయాయి. పాఠశాలలో కృష్ణాష్టమి వేడుకలు సంప్రదాయ శోభను సంతరించుకున్నాయి. kvcs ఈ సందర్భంగా ప్రిన్సిపల్ ప్రశాంత్ మాట్లాడుతూ పాఠశాలలో విద్యార్థులకు విద్యతో పాటు సంస్కృతి సంప్రదాయాల విలువలపై చైతన్య కల్పిస్తున్నామన్నారు. శ్రీ కృష్ణుడు కలియుగంలో అందరి ఆదర్శ ఇష్ట దైవంగా నిలిచారని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్లు మల్లేశం, సతీష్, వెంకటేశం, టీచర్లు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/37849/