schedule Sunday, July 05, 2026

నెహ్రు గంజ్‌లో శ్రావణ శోభ..!

calendar_today August 22, 2025
person dharshininews
నెహ్రు గంజ్‌లో శ్రావణ శోభ..!
నెహ్రు గంజ్‌లో శ్రావణ శోభ..! - రొంపల్లి సంతోష్ ఆధ్వర్యంలో అన్నదానం - పాల్గొన్న ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, నాయకులు - వైభవంగా భజన సమాప్తి ఉత్సవాలు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలోని నెహ్రు గంజ్ ప్రాంతం శ్రావణ శోభను సంతరించుకుంది. శ్రావణ మాసం ఆఖరి శుక్రవారం సందర్భంగా గంజ్ రేణుకా ఎల్లమ్మ దేవాలయంలో శ్రావణ మాస భజన సమాప్తి ఉత్సవాలు వైభవంగా నిర్వహించారు. kvcs దేవాలయంలో అమ్మవారికి అభిషేకాలు, ప్రత్యేక అలంకరణలు చేశారు. అదేవిధంగా యువ నాయకులు రొంపల్లి సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. రొంపల్లి సంతోష్ కుమార్ తన సొంత ఖర్చులతో అన్నదానం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సంతోష్ కుమార్ మాట్లాడుతూ అమ్మవారి అందరిపై ఉండాలని ప్రార్థించారు. మరోవైపు ఈ ఉత్సవాలకు తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి హాజరయ్యారు. ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మార్కెట్ కమిటి చైర్మన్ పట్లోళ్ల బాల్ రెడ్డితో కలిసి అమ్మవారిని దరి ంచుకున్నారు. అదేవిధంగా తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి, పట్టణ సీఐ సంతోష్ కుమార్, హిందూ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి పట్లోళ్ల నర్సింలు, సమితి సభ్యులు. గంజ్ వ్యాపారులు, హమాలి కార్మిక సంఘం సభ్యులు కూడా ఉత్సవాలకు హాజరయ్యారు. రొంపల్లి సంతోష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదానంలో పాల్గొని భక్తులకు అన్నదానం చేశారు. జాతర ఉత్సవాల సందర్భంగా భజన సమాప్తి ఉత్సవాలకు హాజరైన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, చైర్మన్ బాల్ రెడ్డి, డీఎస్పీ, పట్టణ సీఐ, హిందూ ఉత్సవ సమితి సభ్యులను ఘనంగా సన్మానించారు. భజన సమాప్తి ఉత్సవాలతో రేణుకా ఎల్లమ దేవాలయంలో శ్రావణ శోభ సంతరించుకుంది. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/38020/