schedule Thursday, September 10, 2026

మమ్మేల వయ్యా.. గణపయ్యా..!

calendar_today August 27, 2025
person dharshininews
మమ్మేల వయ్యా.. గణపయ్యా..!
మమ్మేల వయ్యా.. గణపయ్యా..! - మున్సిపల్‌ మాజీ చైర్‌ పర్సన్ ఇంట్లో వినాయక చవితి - పూజలు నిర్వహించిన స్వప్న, పరిమళ్‌ దంపతులు - కోట్రిక నివాసంలో మట్టి గణేషునికి పూజలు తాండూరు, దర్శిని ప్రతినిధి : మమ్మేల వయ్యా ఓ బొజ్జ గణపయ్యా అంటూ తాండూరు మున్సిపల్ మాజీ చైర్ పర్సన్‌ల నివాసాల్లో వినాయక చవితి సందడి మొదలైంది. బుధవారం వినాయక చవితి సందర్భంగా వారి వారి నివాసంలో ప్రతి యేడాది మాదిరిగానే వినాయకున్ని ప్రతిష్టించారు. kvcs తాజా మాజీ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్‌, పరిమళ్ గుప్త దంపతులు వారి ఇంట్లో వినాయకునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దీప, దూపాలతో పాటు ఉండ్రాళ్ల నైవేధ్యం సమర్పించారు. అందరిని సల్లంగా చూడాలని వినాయకున్ని వేడుకున్నారు. మరోవైపు తాండూరు మాజీ చైర్ పర్సన్ కోట్రిక విజయలక్ష్మీ వెంకటయ్య నివాసంలో కూడా వినాయక చవితిని ఘనంగా జరుపుకున్నారు. ఇంట్లో మట్టి వినాయకున్ని ప్రతిష్టించి పూజలు నిర్వహించారు. కోట్రిక విజయలక్ష్మీ కోడలు, వాసవీ మహిళ సంఘం అధ్యక్షురాలు కోట్రిక నాగలక్ష్మీ శ్రీకాంత్, కోట్రిక శ్రీకాంత్, కుటుంబ సభ్యులు ప్రతిష్టించిన వినాయకుని ఉండ్రాళ్లు ప్రసాదంను నైవేద్యంగా మొక్కులు తీర్చుకున్నారు. కోట్రిక నివాసంలో నాగలక్ష్మీ స్వయంగా తన చేతులతో మట్టి వినాయకున్ని ప్రతిష్టించి పూజించడం విశేషం. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/38184/