schedule Sunday, July 05, 2026

మండపాలకు గుర్తింపు కార్డులు తీసుకోవాలి

calendar_today August 28, 2025
person dharshininews
మండపాలకు గుర్తింపు కార్డులు తీసుకోవాలి
మండపాలకు గుర్తింపు కార్డులు తీసుకోవాలి - హిందూ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి పట్లోళ్ల నర్సింలు - పలు మండలపాలకు నెంబర్ల కార్డుల పంపిణీ తాండూరు, దర్శిని ప్రతినిధి : వినాయక మండపాలకు నిర్వహకులు గుర్తింపు నమోదు పత్రాలను తీసుకోవాలని హిందూ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి పట్లోళ్ల నర్సింలు అన్నారు. kvcs గురువారం తాండూరు పట్టణం హైదరాబాద్ రోడ్డుమార్గం వీరశైవ సమాజం కాంప్లెక్స్ మొదటి అంతస్తులోని కార్యాలయంలో గుర్తింపు కార్డులను అందజేశారు. ఈ సందర్భంగా పట్లోళ్ల నర్సింలు మాట్లాడుతూ పట్టణంలో వినాయకులను ప్రతిష్టించిన ప్రతి మండపాల నిర్వహాకులు గుర్తింపు పత్రాలను తీసుకోవాలన్నారు. గణనాథులను ప్రతిష్టించిన నిర్వహకులు గుర్తింపు పత్రాలు పొందడం తప్పనిసరి అని, చాలా మంది ముందుకు రావడం లేదని అన్నారు. హిందు ఉత్సవ సమితి తరుపున అందరు గుర్తింపు పత్రాలు తీసుకోవాలన్నారు. వివరాలకు కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కోశాధికారి రొంపల్లి సంతోష్ కుమార్, అధికార ప్రతినిధి పర్యాద రామకృష్ణ, సభ్యులు దావులయ్య, దేవగారి రమేష్ తదితరులు ఉన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/38200/