schedule Thursday, September 10, 2026

వెరైటీ వినాయకులను చూశారా..!

calendar_today August 28, 2025
person dharshininews
వెరైటీ వినాయకులను చూశారా..!
వెరైటీ వినాయకులను చూశారా..! - తాండూరులో తెగ ట్రెండింగ్ గణేషులు - విభిన్న రూపాలకు భక్తుల ఫిదా - దర్శనానికి పొటెత్తున్న భక్తులు తాండూరు, దర్శిని ప్రతినిధి : వినాయక చవితి వచ్చిందంటే మామూలుగా ఉండదు. పండగ ముందే నిర్వహకులు రకరకాల ఆలోచనలు చేస్తూ అందరి దృష్టిలో పడేందుకు విభిన్న ప్రయత్నాలు చేస్తారు. kvcs వీధివీధినా వెరైటీ విగ్రహాలతో మూషిక వాహనలను ప్రతిష్టించి భక్తుల దృష్టిని ఆకర్షిస్తారు. ఏ యేడాదికి ఆ యేడాది ట్రెండ్‌కి తగ్గట్టు కూడా వినాయకుడిని మలుస్తుంటారు. తాజాగా వచ్చిన వినాయక చవితి పండగల్లో కూడా వెరైటీ వినాయకులను ప్రతిష్టించారు. తాండూరులో ప్రతిష్టించిన వెరైటీ వినాయకులు తెగ ట్రెండింగ్ అవుతున్నాయి. పట్టణంలోని కాళికాదేవి ఆలయంలో మైక్రో అర్టిస్ట్ మధు మట్టి కుండలతో వినాయకున్ని తయారు చేశారు. ఇది తాండూరులో టాప్ ట్రెండింగ్ అవుతోంది. అదేవిధంగా మున్సిపల్ పరిధి పాత తాండూరులో వినాయకుడు కూడా భక్తులను ఆకట్టుకుంటున్నారు. ఏఐ విగ్రహాలుగా దర్శనిస్తున్నాయి. యాదిరెడ్డి చైరస్తాలో శివుని అవతారంలో వినాయకుడు దర్శనమిస్తున్నారు. అదేవిధంగా శివాజీ చౌరస్తాలో తంబూరా వాయిస్తున్నా వినాయకుడు మంత్రముగ్దుల్ని చేస్తున్నారు. ప్రతి యేడాది మాదిరిగానే పట్టణంలోని వినాయక చౌరస్తాలోని వినాయుడు కూడా టాప్ ట్రెండింగ్‌లో ఉన్నారు. ఆయా గణనాథులను చూసేందుకు భక్తులు మండపాల వద్దకు వెళుతున్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/38209/