schedule Wednesday, September 09, 2026

గణనాథునికి నీరాజనం..!

calendar_today August 30, 2025
person dharshininews
గణనాథునికి నీరాజనం..!
గణనాథునికి నీరాజనం..! - శాంతి నగర్‌లో ఉప్పొంగుతున్న భక్తి భావం - ఘనంగా వినాయక పూజలు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలోని శాంతినగర్ భక్తులు వినాయకునికి ఘన నీరాజనాలు పలుకున్నారు. వినాయక చవితి సందర్భంగా ప్రతిష్టించిన గణనాధునికి పూజలు నిర్వహిస్తున్నారు. kvcs పెద్దేముల్ మాజీ జడ్పి టిసి ఉప్పరి స్వరూప మల్లేశం ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహిస్తున్నారు. మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని కోలాటం ఆటపాటలతో అలరిస్తున్నారు. అలాగే కొడంగల్ రోడ్డులోని శ్రీరామ్ నగర్ లోను ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. మహిళలు ఆటపాటలతో ఉత్సహంగా పూజలు చేస్తున్నారు. భక్తులకు అన్నదానం చేస్తున్నారు. ఆధ్యాత్మిక వాతావరణలో వేడుకలు జరుపుకుంటూ వినాయకుని సేవలో తరిస్తున్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/38249/