schedule Sunday, July 05, 2026

పట్టణ పరిశుభ్రతలో కార్మికులది కీలక పాత్ర

calendar_today August 31, 2025
person dharshininews
పట్టణ పరిశుభ్రతలో కార్మికులది కీలక పాత్ర
పట్టణ పరిశుభ్రతలో కార్మికులది కీలక పాత్ర - తాండూరు మున్సిపల్ కమీషనర్ యాదగిరి - పారిశుద్ధ్య కార్మికులుకు జాకెట్ల పంపిణీ తాండూరు, దర్శిని ప్రతినిధి : పట్టణ పరిశుభ్రతలో పారిశుద్ధ్య కార్మికులది కీలక పాత్ర ఉంటుందని తాండూరు మున్సిపల్ కమీషనర్ యాదగిరి అన్నారు. ఆదివారం తాండూరు పాత మున్సిపల్ కార్యాలయంలో పారిశుద్ధ్య కార్మికులకు కమీషనర్ యాదగిరి చేతుల మీదుగా జాకెట్ కవర్లను పంపిణీ చేశారు. kvcs ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పారిశుద్ధ్య కార్మికులను గుర్తించేందుకు జాకెట్ కవర్లను పంపీణీ చేయడం జరుగుతుందన్నారు. ప్రతి ఒక్కరు విధిగా ధరించి పనులు నిర్వహించాలన్నారు. పట్టణ పరిశుభ్రతలో పారిశద్ధ్య కార్మికులదే కీలక పాత్ర అని, వారి అవసరాలను గుర్తిండమే కాకుండా సమస్యలను పరిష్కరించేలా చూస్తామన్నారు. ఈ కార్యక్రమంలో డీఈ మణిపాల్, ఏఈ ఖాజా హుస్సేన్, మేనేజర్ నరేందర్ రెడ్డి, శానిటరి ఇను స్పెక్టర్లు వెంకటయ్య. ఉమేష్, జవాన్లు శ్రీనివాస్, వీరన్న, అశోక్ తదితరులు పాల్గొన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/38267/