schedule Thursday, July 09, 2026

రూ. 2లక్షల 52వేలకు లడ్డూ వేలం

calendar_today August 31, 2025
person dharshininews
రూ. 2లక్షల 52వేలకు లడ్డూ వేలం
రూ. 2లక్షల 52వేలకు లడ్డూ వేలం - దక్కించుకున్న మార్వాడి వ్యాపారి నందకిషోర్ పర్తాని - మార్వాడి గణేష్‌ ఉత్సవ సమితి లడ్డూ వేలంకు స్పందన తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలో లడ్డూ వేలంకు క్రేజ్ పెరిగింది. వినాయకుని వద్ద పూజించిన లడ్డు రూ. 2లక్షల 52వేలకు భక్తుడు దక్కించుకున్నాడు. kvcs తాండూరు పట్టణంలోని మార్వాడి గణేష్‌ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో వినాయకున్ని ప్రతిస్టించారు. ఈ ఐదు రోజులు పూజించిన వినాయకుని లడ్డును ఆదివారం నిమజ్జనం సందర్భంగా వేలం నిర్వహించారు. ఈ వేలంలో మార్వాడి వ్యాపారి నందకిషోర్ పర్తాని రూ. 2లక్షల 52వేలకు దక్కించుకున్నారు. దీంతో ఉత్సవ సమితి సభ్యులు ఆయనకు సంప్రదాయంగా లడ్డును అందజేశారు. ఈ సందర్భంగా వినాయకుని ఉత్సవాలు భక్తిశ్రద్దలతో జరుపుకోవడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మార్వాడి సంఘాల ప్రతినిధులు, పెద్దలు, వ్యాపారులు, యువకులు, మహిళలు పాల్గొన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/38269/