schedule Thursday, July 09, 2026

గణేష్ లడ్డూకు ల్యాటరీ..!

calendar_today September 2, 2025
person dharshininews
గణేష్ లడ్డూకు ల్యాటరీ..!
గణేష్ లడ్డూకు ల్యాటరీ..! - కోట్రిక కుటుంబానికి దక్కిన అదృష్టం - చెంగోల్ ఉత్సవ సమితి సంప్రదాయం తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మండలం చెంగోల్ గ్రామంలో వినాయకుని వద్ద ప్రతిష్టించిన లడ్డూకు ల్యాటరీ నిర్వహించారు. ఈ ల్యాటరీలో తాండూరుకు చెందిన మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ కోట్రిక విజయలక్ష్మీ వెంకటయ్య కుటుంబానికి అదృష్టం దక్కింది. kvcs చెంగోలు గ్రామంలోని వెంకటేశ్వర దేవాలయం వద్ద వినాయక ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఏడు రోజులుగా వినాయక చవితి ఉత్సవాలు జరుపుకున్నారు. మంగళవారం వినాయకుని వద్ద పూజలందుకున్న లడ్డూకు ల్యాటరీ నిర్వహించారు. ఈ ల్యాటరీలో తాండూరు మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ కోట్రిక విజయలక్ష్మీ కోడలు, వాసవీ మహిళ సంఘం అధ్యక్షురాలు కోట్రిక నాగలక్ష్మీ శ్రీకాంత్ కు అదృష్టం దక్కింది. దీంతో ఉత్సవ సమితి సభ్యులు కోట్రిక కుటుంబ సభ్యులను ఆహ్వానించారు. గౌరవ సంప్రదాయాలతో మాజీ చైర్ పర్సన్ కోట్రిక విజయలక్ష్మీ సమక్షంలో లడ్డును అందజేశారు. లడ్డూ దక్కించుకున్న కుటుంభ సభ్యులను బ్యాండు బాజాలతో వారిని సాగనంపారు. ఈ సందర్భంగా కోట్రిక విజయలక్ష్మీ, నాగలక్ష్మీలు మాట్లాడుతూ వినాయకుని కృప, ఆశీస్సులతో తమకు పవిత్ర పూజలందుకున్న లడ్డూ ప్రసాదం దక్కడంపై సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కోట్రిక శ్రీకాంత్, ఉత్సవ సమితి సభ్యులు, భక్తులు ఉన్నారు. ఇదికూడా చదవండి.... https://www.dharshininews.com/38374/