యూరియా కోసం ఆందోళన
September 3, 2025
dharshininews
యూరియా కోసం ఆందోళన
- యాలాలలో ఆగ్రహించిన అన్నదాతలు
- పీఏసీఎస్ ఆఫీసును మూసి వేసిన రైతులు
- అందరికి సరిపడా ఇవ్వాలని దర్నా
తాండూరు, దర్శిని ప్రతినిధి : యాలాల పీఏసీఎస్ కార్యాలయం వద్ద యూరియా కోసం యుద్ధం జరిగినంత పనైంది. అందరికి యూరియా అందించాలని వివిధ గ్రామాల రైతులు ఆందోళనకు దిగారు. బుధవారం పీఏసీఎస్ కార్యాలయంను మూసి వేసి దర్నాకు దిగారు. దీంతో కార్యాలయం వద్ద ఉద్రిక్తత ఏర్పడింది.
మండలంలోని పీఏసీఎస్ కార్యాలయం వద్దకు వివిధ గ్రామాలకు చెందిన రైతులు యూరియా కోసం వచ్చారు. బస్తాలు తీసుకునేందుకు బారులు తీరారు. యాలాల కార్యాలయంతో పాటు బషీరాబాద్ పీఏసీఎస్ కార్యాలయానికి సంబంధించిన యూరియాను ఓ లారీలో తెప్పించారు. యాలాల పీఏసీఎస్ లో 225 బస్తాలను లోడ్ చేశారు. అప్పటికే బారులు తీరిన రైతులు కార్యాలయంలో సరిపడా యూరియా లేదని రైతులు ఆందోళనకు దిగారు. అందరికి సరిపడే విధంగా యూరియా అందించాలని డిమాండ్ చేశారు.
అధికారులు టోకన్ల ప్రకారం అందిస్తామని చెప్పినా అంగీకరించలేదు. మిగతా సగం లోడ్ తో బషీరాబాద్ కు వెళ్లే లారీని అడ్డుకుని దర్నా చేశారు. అందిరికి యూరియా అందించే వరకు ఊరుకునేది లేదని కార్యాలయాన్ని కూడా మూసి వేశారు. దీంతో కార్యాలయం వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. మరో వైపు రైతుల దర్నాకు కేవీపీఎస్, సీపీఎం నాయకులు మద్దతు తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపు చేశారు. అనంతరం అధికారులు ప్రస్తుతం ఉన్న యూరియా బస్తాలు అందించి.. మిగతా రైతులకు మళ్లీ కోటా వచ్చిన తరువాత అందిస్తామని నచ్చజెప్పారు.
ఇదికూడా చదవండి....
https://www.dharshininews.com/38380/