schedule Thursday, July 09, 2026

మహానేత మాణిక్ రావు

calendar_today September 5, 2025
person dharshininews
మహానేత మాణిక్ రావు
మహానేత మాణిక్ రావు - తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి - జయంతిలో చిత్రపటానికి నివాళులు తాండూరు, దర్శిని ప్రతినిధి : బలహీన వర్గాల అభివృద్ధికి పోరాడిన స్వర్గీయ మాజీ మంత్రి మాణిక్రోవు ను మహానేత అని తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అభివర్ణించారు. శుక్రవారం హైదరాబాద్‌లోని తన నివాసంలో మాణిక్ రావు జయంతిని జరుపుకున్నారు. ఈ సందర్భంగా మాణిక్ రావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తాండూరు ప్రాంతంలో తెలంగాణ తొలిదశ ఉద్యమకారుడుగా మాణిక్ రావు ప్రజల మనస్సుల్లో నిలిచిపోయారని అన్నారు. kvcs బహుజన వర్గాల అభ్యున్నతి కోసం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో గళం విప్పిన నేతగా గుర్తుండి పోయారని అన్నారు. సబ్బండ వర్గాల సంక్షేమానికి పాటుపడిన ఆయన ఆశయ సాధనకు అందరం కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వివిధ మండలాల నేతలు, నాయకులు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/38409/